NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Guinness Record: అత్యధిక పెళ్లిళ్లలో పురుషుల్లో జియానో చానా..! మహిళల్లో ఈ బామ్మే రికార్డు..!!

the woman who married 23 times creates Guinness Record

Guinness Record: దేశంలో గానీ ప్రపంచంలో గానీ ఎవరూ చేయని, చేయలేని పనులు చేస్తే వారు ఆ రంగంలో రికార్డు సృష్టించినట్లు అవుతుంది. అదే కోవలో అత్యధిక పెళ్లిళ్లు చేసుకుని కూడా వీరు రికార్డు నెలకొల్పారు. పురుషుల్లో మిజోరాంకు చెందిన జియోనా చానా (76) 38 పెళ్లిళ్లు చేసుకుని రికార్డు నెలకొల్పగా మహిళల్లో లిండా ఉన్నారు.

the woman who married 23 times creates Guinness Record
the woman who married 23 times creates Guinness Record

జియోనా చానా ఇటీవల మృతి చెందగా మిజోరాం ముఖ్యమంత్రి కూడా సంతాపం తెలిపారు. జియోనా చానాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, మనుమలు, మనువరాళ్లు,కోడళ్లు మొత్తం కలిపి కుటుంబ సభ్యుల సంఖ్య 160 మంది పైగానే ఉన్నారు. ప్రపంచంలో అతి పెద్ద కుటుంబం కల్గిన వ్యక్తిగా జియోనా చానా రికార్డు సృష్టించి పాపులర్ అయ్యారు. జియోనా చానా గురించి డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి.  పురుషుల్లో ఇన్ని పెళ్లిళ్లు చేసుకుని జియోనా చానా రికార్డు సృష్టించగా అత్యధిక వివాహాలు చేసుకున్న మహిళ ఎవరైనా ఉన్నారా అన్న శోధన ప్రారంభమైంది. మన దేశంలో అయితే అటువంటి మహిళ లేదు కానీ అమెరికాలో ఉంది.

Read More: AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు తీర్పు రిజర్వు..! ఇంటర్వ్యూలపై సర్వత్రా ఉత్కంఠ..!!

లిండా లో టేలర్ వుల్ఫ్ ప్రపంచంలో ఎక్కువ వివాహాలు చేసుకున్న మహిళగా గుర్తింపు పొందింది. ఆమె ఇప్పటి వరకూ 23 మందిని పెళ్లి చేసుకుని ప్రపంచంలో అత్యధిక వివాహాలు చేసుకున్న మహిళగా రికార్డు నమోదు చేసుకున్నారు. ఆమె వివాహాలు చేసుకున్న వారిలో మోసగాళ్లు ఉన్నారు. నేరస్థులు ఉన్నారు. మత బోధకులు, గేలు, సంగీత కళాకారులు ఉన్నారు. ఆమెను కొట్టి హింసించిన వాళ్లు, జీవితంలో ఏమీ లేక ఆమె వద్దనే స్వాంతన పొందిన వారు ఉన్నారు. ఈ క్రమంలోనే అత్యధిక సార్లు పెళ్లి చేసుకున్న మహిళగా గిన్నిస్ రికార్డులోనూ పేరు నమోదు చేసుకుంది ఈ  68 ఏళ్ల బామ్మ.

ఆ వృద్ధురాలు ప్రస్తుతం తన శేష జీవితాన్ని ఆమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో గడుపుతోంది. ఆమె చివరి వివాహం 1996లో గ్లిన్ స్కాటీ వుల్ఫ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నది. గ్లిన్ ను లిండా ప్రేమించి వివాహం అయితే చేసుకోలేదు. కానీ అప్పటికే 28 వివాహాలు చేసుకున్న గ్లిన్ 29వ పెళ్లి చేసుకుని రికార్డు సృష్టించడం కోసం లిండాను పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఏడాదికే 1997లో గ్లిన్ చనిపోయాడు. లిండా తొలి వివాహం 1957లో 16 ఏళ్ల వయసులో చేసుకుందట. ఆమె మొదటి భర్త జార్జ్ స్కాట్ వయసు అప్పుడు 31. ఏడు సంవత్సరాల పాటు వారు కాపురం చేశారు. అదే ఆమె జీవితంలో సుదీర్ఘ వైవాహిక జీవితం. మిగిలిన వారు ఎవరూ ఆమెతో ఎక్కువ కాలం వైవాహిక జీవితం కొనసాగించలేదు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N