Bride refuses to marry: బుల్లెట్ అడిగిన వరుడుకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు..!!

Share

Bride refuses to marry: ఆడ పిల్లలు కన్న తల్లిదండ్రులు తమ కుమార్తె అత్తవారింట్లో ఎటువంటి ఇబ్బంది పడకూడదని పెళ్లి కుమారుడు అడిగిన కోర్కెలు అన్నీ తీరుస్తుంటారు. ముందుగానే కట్న కానుకలను మాట్లాడుకోవడం దాని ప్రకారం వివాహానికి ముందుగానే వారికి అందజేయడం జరుగుతుంటుంది. ఒక్కో సందర్భంలో పేచీ కోరుల కారణంగా వరకట్నం కారణంగా పీటల దాకా వచ్చి ఆగిపోయిన పెళ్లిళ్లు అనేకం ఉన్నాయి. పీటల మీద వరకూ వచ్చి పెళ్లి ఆగిపోతే తమ కమార్తెకు భవిష్యత్తులో సంబంధాలు వస్తాయో రావో అని వధువు తల్లిదండ్రులు ఏదో విధంగా మగ పెళ్లివారు అడిగిన కోర్కెలను తీరుస్తుంటారు. అయితే ఇటీవల ఉత్తరప్రదేశ్ బరేలీ లో కట్నం అడిగిన ఓ వరుడికి వధువు భారీ షాక్ ఇచ్చింది. నువ్వు వద్దు, నీతో నిఘా వద్దు జాన్‌దేవ్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది.

Bride refuses to marry on dowry demand
Bride refuses to marry on dowry demand

విషయంలోకి వెళితే …పర్తాపూర్ చౌధరీ గ్రామానికి చెందిన ఖలీల్ ఖాన్ కుమార్తె  కుతురు కుల్సుమ్ కు జీవన్ ఖాన్ తో పెళ్లికి నిశ్చయించారు పెద్దలు. ఫిబ్రవరిలో వివాద నిశ్చయం (ఎంగేజ్‌మెంట్) జరిగింది. ఈ సమయంలో వరకట్నంకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు వరుడి తరపు వారు చేయలేదు. రెండు రోజుల క్రితం బరాత్ పెట్టుకోగా దాని కోసం తమ ఆర్థిక పరిస్థితికి తగిన విధంగా ఖాలీల్ ఖాన్ ఏర్పాట్లు చేశారు. తనకు ఉన్నంతలో కట్నకానుకలను సిద్ధం చేశాడు.

Read More: AP CM YS Jagan: రెండేళ్ల పాలనలో ప్రజలకు రూ.1.31లక్షల కోట్లు పంపిణీ చేశామన్న సీఎం జగన్

అయితే ఆకస్మికంగా వరుడు జీవన్ ఖాన్ తన లగ్జరీ బైక్ కొని ఇవ్వాలంటూ షరతు పెట్టాడు. దీంతో వథువు తండ్రి ఖంగుతిన్నాడు. అకస్మాత్తుగా లగ్జరీ బైక్ కావాలంటే ప్రస్తుత లాక్ డౌన సమయంలో కష్టమని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా బుల్లెట్ ధర రూ.2.30లక్షలు నగదు అయినా ఇవ్వాలని వరుడు డిమాండ్ చేశారు.

బరాత్ వరకూ వచ్చి వేడుక ఆగిపోతే తనకు నామర్ధా అనుకున్న ఖలీల్ ఖాన్ అప్పటికప్పుడు ఆ మొత్తాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఆ కొద్ది సేపటికే ఖలీల్ ఖాన్ అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడ్డాడు. ఈ పరిస్థితులు అన్ని గమనించి వథువు కుల్సుమ్ అతిధులందరి ముందే తాను ఈ వివాహం చేసుకోనని తెగేసి చెప్పింది. తండ్రితో సహా బంధువులు ఎవరు చెప్పినా ఆ యువకుడితో పెళ్లి నో చెప్పేసింది. వివాహ నిశ్చయ సమయంలో కట్న కానుకల ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు కట్నం అడుగుతున్నారు. రేపు పెళ్లి అయన తరువాత ఇంకా ఇంకా కావాలని అడుగుతూనే ఉంటారు. ఇటువంటి సంబంధం అవసరం లేదంటూ ఆమె తెగేసి చెప్పడంతో పెళ్లి రద్దు అయ్యింది.


Share

Related posts

జబర్దస్త్ : పాపం సుడిగాలి సుధీర్ .. స్టేజీ మీదే గాలి తీసేసిన ఎమ్మెల్యే రోజా !

sekhar

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్..!!

bharani jella

‘ఆఖరి ‘దారి మూసేస్తే ఎలా ?

Yandamuri