Central Ministers: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటిలో మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. మోడి రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి భవనంలో సాయంత్రం ఆరు గంటలకు జరిగే కార్యక్రమంలో మొత్తం 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ లోకి ఎవరెవరిని తీసుకుంటున్నారు అనేది అత్యంత గోప్యంగా ఉంచారు. ప్రమాణ స్వీకారం చేయనున్న వారిలో చాలా మంది కొత్త వారు ఉండగా, కొందరు సహాయ మంత్రులు పదోన్నతిపై కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

ప్రమాణం చేయనున్న చేయనున్న మంత్రలు వీరే..
నారాయణ రాణే. సర్బానంద్ సోనోవాలా, డాక్టర్ వీరేంద్ర కుమార్, జ్యోతిరాదిత్య సింధింయా, రామచంద్ర ప్రసాద్ సింగ్, అశ్వనీ వైష్ణవ్, పశుపతి కుమార్ పారన్, కిరణ్ రిజిజు. రాజ్ కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పూరీ, మన్సుఖ్ మాండవ్య, భూపేందర్ యాదవ్, పురుషోత్తం రుపాలా, కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పంకజ్ చౌధురి. అనుప్రియా పటేల్, సత్యపాల్ సింగ్ బాఘేల్, రాజీవ్ చంద్రశేఖర్, శోఖా కరంద్లాజే, కౌశల్ కిశోర్, అజయ్ భట్, బిఎల్ వర్మ, అజయ్ కుమార్, చౌహన్ దేవూసింగ్, భగవంత్ ఖూబా, కపిల్ మోరేశ్వర్ పాటిల్, ప్రతిమా భౌమిక్, భగవత్ కృష్ణారావు, సుభాశ్ సర్కార్, అజయ్ కుమార్ రాజన్ సింగ్, భారతీ పవార్, విశ్వేశ్వర్ తుడు, శంతనూ ఠాకూర్, మహేంద్ర భాయ్, జాన్ బర్లా, మురుగన్, నితీష్ ప్రామాణిక్.
ప్రమాణ స్వీకారానికి ముందు ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని మోడి సూచనల మేరకు 12 మంది కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు.