ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన .. రాహుల్ గాంధీ సహ నేతల నిర్బంధం

Share

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, శశి ధరూర్ సహా ఆ కాంగ్రెస్ పార్టీ నేతలను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. చలో రాష్ట్రపతి భవన్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తొలుత పెరుగుతున్న ధరలు, నిరుద్యోగానికి నిరసనగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ఈ రోజు పార్లమెంట్‌లో నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపారు. దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గందరగోళం నేపథ్యంలో సభా కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వెలుపల జరిగిన ఎంపీలు నిర్వహించిన కార్యక్రమంలో సోనియా గాంధీ పాల్గొన్నారు.

 

అనంతరం రాహుల్ గాంధీ తో సహా ఎంపీలు, నేతలు రాష్ట్రపతి భవన్ దిశగా దూసుకుపోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్, శశిధరూర్, ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు వ్యాన్ ఎక్కించి తరలించారు. పారా మిలటరీ దళాలు, ఢిల్లీ పోలీసులు విజయ్ చౌక్ రోడ్డును బ్లాక్ చేశారు. పార్లమెంట్ నుండి రాష్ట్రపతి భవన్ మార్గంలో బారికేడ్లు పెట్టారు. కాంగ్రెస్ ఎంపీల నిరసన ప్రదర్శనను నిలువరించడానికి మహిళా పోలీసులను సైతం రంగంలోకి దించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ .. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. మన దేశం ఇప్పుడు నలుగురు వ్యక్తుల నియంతృత్వంలో ఉందని విమర్శించారు.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

58 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

6 hours ago