17.2 C
Hyderabad
December 5, 2022
NewOrbit
Entertainment News రివ్యూలు సినిమా

దుల్కర్ సల్మాన్ “సీత రామం” సినిమా రివ్యూ..!!

Share

సినిమా పేరు: సీతా రామం
దర్శకుడు: హను రాఘవపూడి
నటీనటులు: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ప్రకాష్ రాజ్
నిర్మాతలు: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: పిఎస్ వినోద్ & శ్రేయాస్ కృష్ణ

పరిచయం:-

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన “సీతా రామం” నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. టైటిల్ ప్రకటించిన నాటి నుండి ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా పాటలు, సినిమా పోస్టర్ లు.. ట్రైలర్ మొదటి నుండి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా లవ్ స్టోరీలా స్పెషలిస్ట్ డైరెక్టర్ గా పేరు ఉన్న హను రాఘవపూడి ఈ సినిమా తెరాకెక్కించడంతో “సీతా రామం” పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చాలా భాషలలో భారీ ఎత్తున చేయటంతో పాటు తెలుగులో ఎన్నడూ లేని రీతిలో దుల్కర్ సల్మాన్.. అనేక ఇంటర్వ్యూలు ఇవ్వటంతో “సీతా రామం” కి మంచి క్రేజ్ వచ్చింది. ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

Dulquer Salmaan Sitha Ramam Movie Review

స్టోరీ :-

సినిమాలో లెఫ్ట్ నేంట్ రామ్ (దుల్కర్ సల్మాన్) తన ప్రేయసి కోసం  సీతకి(మృణాల్ ఠాకూర్) రాసిన లెటర్ ఆఫ్రిన్ (రష్మిక మందన) అందజేయడానికి రెడీ అవుద్ధి. ఆఫ్రిన్ కి మాత్రం రామ్ అదేవిధంగా సీత గురించి పెద్దగా ఏమీ తెలియదు. దీంతో బాలాజీ సహాయంతో వారిని వెతుక్కుంటూ ఉంటది. ఆ ఉత్తరం చేరాల్సిన చోట చేరిస్తే తప్ప అఫ్రీన్ కి తాత ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. దీంతో అఫ్రీన్ ఆ లెటర్ అందుకొని.. బాలాజీ సహాయంతో.. వెతుక్కుంటూ వెళ్తూ…రామ్ తో కలిసి పని చేసిన ఓ ఆఫీసర్ విష్ణువర్మని కలుస్తది. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాల క్రితం హీరో రామ్ మరియు హీరోయిన్ సీత మధ్య స్టార్ట్ అయిన ప్రేమ కథ రివీల్ అవుతది. హైదరాబాదులో ఉన్న సీతామలక్ష్మి కోసం రామ్ రాసిన ఈ లెటర్ పట్టుకుని వెతుకులాట స్టార్ట్ చేసిన అఫ్రీన్ కి విష్ణువర్మని కలిసిన తర్వాత కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. సినిమాలో లెఫ్టనేంట్ రామ్ ఓ అనాధ. ఇదే సమయంలో దేశం కోసం నిజాయితీగా పనిచేసే సైనికుడు. ఈ క్రమంలో హఠాత్తుగా సీతామాలక్ష్మి నుండి ఉత్తరాలు రావటంతో పాటు అతనికి ఆమె చిరునామా పెద్దగా తెలియదు. అనాధగా ఉన్న రామ్ కి ఒక అజ్ఞాత వ్యక్తి నుండి ఉత్తరాలు వస్తూ ఉండటంతో.. ఎంతో సంతోషిస్తూ మరో ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇటువంటి తరుణంలో ఒకరోజు సడన్ గా తనకి ఉత్తరాలు రాసే సీతామాలక్ష్మి (మృణాల్ ఠాకూర్) నీ కలవడం జరుగుద్ది. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి… పెళ్లి దాకా పరిస్థితి వెళ్లిన క్రమంలో నన్ను పెళ్లి చేసుకుంటావా అని సీతని.. రామ్ ప్రశ్నిస్తాడు. ఈ క్రమంలో సీత నుండి ఎటువంటి సమాధానం రాకుండానే విడిపోతారు. అప్పటి నుండి సీత కోసం రామ్ అనేక ఉత్తరాలు రాస్తారు. ఒక ఉత్తరం పాకిస్తాన్ లో 20 సంవత్సరాలు ఆగిపోతుంది. దీంతో ఆ ఉత్తరాన్ని సీత వద్దకు చేర్చడానికి ఆఫ్రిన్ పడే కష్టాలు వాళ్ళిద్దరి గురించి తెలుసుకునేది తెరపై అద్భుతంగా డైరెక్టర్ చూపించడం జరిగింది. మరి సీత అదే విధంగా రామ్ చివరిలో కలుసుకున్నారా..? ఆఫ్రిన్ ఉత్తరం జార వేసిందా..? .. ఇవన్నీ తెలుసుకోవాలంటే “సీత రామం” సినిమా చూడాల్సిందే.

Dulquer Salmaan Sitha Ramam Movie Review
విశ్లేషణ:

 

“సీత రామం” అని టైటిల్ పెట్టి యుద్ధం రాసిన ప్రేమ కథ అని పెట్టిన ట్యాగ్ లైన్ కి తగ్గ రీతిలోనే చాలా అద్భుతంగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించారు. ఫస్టాఫ్ కొద్దిగా బోర్ అనిపించినా గానీ మెల్లమెల్లగా ప్రేమ కథలోకి సినిమాని తీసుకెళ్లే విధానం ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటది. రొమాంటిక్ మెలోడీ డ్రామా కొంచెం థ్రిల్లర్ తో… చివరి అరగంటలో ఊహించిన ట్విస్ట్ లు.. క్యారెక్టర్లలో చూపిస్తూ రెండు టైం పీరియడ్స్ లో 1965, 1985 భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ నేపథ్యంలో స్టార్ట్ అవుద్ది. సినిమా ప్రారంభంలో లండన్.. తర్వాత పాకిస్తాన్.. ఆ తర్వాత ఇండియా చుట్టూ స్టొరీ ఉంటుంది. ముఖ్యంగా సినిమాలో ఎక్కువ భాగం కాశ్మీర్ లో అందమైన సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. యుద్ధ సన్నివేశాలతో పాటు హీరో మరియు హీరోయిన్ మధ్య వచ్చే సంభాషణ చాలా మెలోడీగా డైరెక్టర్ తెరకెక్కించాడు. స్వచ్ఛమైన ప్రేమ అన్నతరాహాలు ఒక సైనికుడికి మరో అమ్మాయికి మధ్య.. జరిగే సంభాషణ యే “సీత రామం”. ప్రారంభంలో స్లోగా ఉన్నా గాని ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సస్పెన్స్ నుండి సెకండాఫ్ చివరి వరకు సినిమా మంచి హైప్ లో ఉంటుంది. ఒకపక్క యుద్ధ సన్నివేశాలు మరోపక్క ప్రేమ కథ నడిపించే విధానం సినిమాని ఎంతో అద్భుతంగా చిత్రీకరించినట్లు ఉందని చెప్పవచ్చు. విష్ణు శర్మ పాత్రలో సుమంత్ నటన సినిమాకి అత్యంత కీలకమైనది. చాలావరకు సినిమా స్టోరీని.. నడిపించే రీతిలో విష్ణు శర్మ పాత్ర ఉంటుంది.

 

ప్లస్ పాయింట్స్:-

నటీనటుల పెర్ఫార్మెన్స్,
స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్:-

ఫస్టాఫ్
రిపీట్ సీన్స్
కామెడీ

మొత్తంగా: యుద్ధ నేపథ్యంలో పుట్టిన ప్రేమ కథ “సీత రామమ్” ఒక మెలోడీ సినిమా అని చెప్పవచ్చు.
రేటింగ్:- 3.5/5

Share

Related posts

బాల‌య్య త‌గ్గాడు, చిరంజీవి వ‌చ్చేస్తున్నాడు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే!?

kavya N

నాని ఆ మాట చెప్పడం వల్లే నిర్మాత సినిమాని వదిలేశాడా ..?

GRK

ర‌ష్మిక మీద ఫైర్ అయింది ఎవ‌రో తెలుసా?

Siva Prasad