కేబుల్ రంగాన్ని కాపాడాలి

న్యూఢిల్లీ  డిసెంబర్ 27: కొత్త కేబుల్‌ నిబంధనల వల్ల కేబుల్‌ ఆపరేటర్లపై అధిక భారం పడుతుందని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్‌ రెడ్డి అన్నారు. పే ఛానల్స్‌ యాజమాన్యాలు ఎంఎస్ వోలు, కేబుల్‌ ఆపరేటర్లకు సమానంగా చెల్లించాలని కోరారు. కేబుల్‌ ఆపరేటర్ల సమస్యలపై లోక్ సభలో జితేందర్‌ రెడ్డి మాట్లాడుతూ కేబుల్‌ ఆపరేటర్లకు ఐదు శాతమే జీఎస్టీ వర్తింపచేయాలని  కోరారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో మీడియా పాత్ర చాలా కీలకమైందన్నారు. కేబుల్‌ రంగాన్ని కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు