ఉక్కు పెద్ద జోక్: విజయసాయిరెడ్డి

అమరావతి, డిసెంబరు27: కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన 2018 అతి పెద్ద జోక్ గా చెప్పొచ్చని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. గురువారం సిఎం చంద్రబాబు కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసిన నేపధ్యంలో స్పందిస్తూ 18 వేల కోట్లతో నిర్మిస్తారట. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంటే ఎవరిని మోసం చేయడానికి నాయుడుబాబు అంటూ విమర్శలు గుప్పించారు. ఎందుకు ఇంత హడావుడి. టెండర్లు లేవు. టెక్నాలజి ఎంపిక జరగలేదు. బినామీల రియల్ ఎస్టేట్ దందాకోసమేనా? అని ప్రశ్నించారు.