Apps: 2021 లో అత్య అధికంగా డౌన్లోడ్ అయిన యాప్స్ ఇవే…!

Share

most downloaded apps: 2021వ సంవత్సరంలో యాప్ స్టోర్ మరియు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లలో ఎటువంటి యాప్స్ ను ఎక్కువ మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. మరియు ఏ యాప్స్ ను ప్రజలు ఎక్కువగా ఉపయోగించారనే విషయాలను గురించి చాలా మంది వెతుకుతుంటారు. ఈ రికార్డులను సెన్సార్ టవర్ అనే సంస్థ రిలీజ్ చేసింది. వాటి వివరాలేంటో ఇప్పుడు ఓ సారి తెలుసుకుందాం…

టిక్ టాక్ హవా…

ఇండియాలో నిషేధించినప్పటికీ టిక్ టాక్ హవా ఏమాత్రం తగ్గలేదు. వరుసగా 2021 వ సంవత్సరం కూడా అత్యధిక మంది డౌన్ లోడ్ చేసుకున్న యాప్ గా మరియు అత్యధిక రెవెన్యూ పొందిన యాప్ గా టిక్ టాక్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఆండ్రాయిడ్ మరియు యాపిల్ స్టోర్లలో కలిపి టిక్ టాక్ యాప్ ను 2021లో 745.9 మిలియన్ల మంది యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో కాకుండా యాపిల్ ఫోన్లలో కూడా అనేక మంది యూజర్లు ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నారు. ఈ 2021 డౌన్ లోడ్ల సంఖ్య 2020తో పోలిస్తే కాస్త తగ్గినప్పటికీ టిక్ టాక్ మొదటి ప్లేస్ కు మాత్రం ఢోకా లేకుండా పోయింది. 2020లో టిక్ టాక్ యాప్ ను 980.7 మిలియన్ల మంది యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా టిక్ టాక్ యాప్ ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. దాంతో డౌన్ లోడ్ ల సంఖ్య పోయిన సంవత్సరంతో పోల్చకుంటే కాసింత తగ్గింది.

మోస్ట్ పాపులర్ గేమ్ గెరీనా ఫ్రీ ఫైర్…

ఈ ఏడాదిలో యూజర్లను ఎక్కువగా ఆకట్టుకున్న గేమ్ గా గెరీనా ఫ్రీ ఫైర్ నిలిచింది. తర్వాతి స్థానాల్లో సబ్ వే సర్ఫేస్, పబ్జీ వంటి గేమ్ లు ఉన్నాయి. యూజర్లు గేమింగ్ సబ్ స్క్రిప్షన్ కోసం చేసే ఖర్చు 2020తో పోలిస్తే దాదాపు 19.7 శాతం పెరిగింది.


Share

Related posts

SVP: సర్కారు వారి పాట సినిమా నుండి మరో సర్ప్రైస్..!!

sekhar

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ ని ఊరించి ఒక్కసారిగా నిరాశపరిచిన తమన్..!!

sekhar

అందరికి వాక్సిన్ ఇవ్వడం కోసం మోడీ పెట్టనున్న ఖర్చు ఎంతో తెలుసా???

Naina