ఒక స్టార్ హీరో సినిమా షూటింగ్ మొదలు పెట్టి సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేయాలంటే చాలా కష్టం. ఆ చిత్రాన్ని ప్రారంభించినప్పటి నుండి ఎన్నో అడ్దంకులను అధిగమించవలసి ఉంటుంది. అందులో ఆ మూవీకి సంబంధించిన సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడటం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఎంతో మంది నిపుణులు, సాంకేతిక వర్గం సహకారంతో నిర్మించే చిత్రాన్ని విడుదలకు ముందు ఎలాంటి లీక్స్ లేకుండా రీలీజ్ చేయడం ఒక సాహసం అనే పేర్కొనాలి. అసలే లోకంలో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రతి వారిని ఆందోళనకు గురిచేసే స్దాయిలో ఉంది. అందులో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల సినిమా ఇండస్ట్రీలో లీకుల బెడద ఎక్కువవుతూ వస్తోంది.
ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్‌కు కూడా లీకుల బెడద తప్పలేదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్” కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. కాగా చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్దాయి. కానీ ఈ సినిమాకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా లీకుల బెడద నీడలా వెంటాడుతుంది. అయితే షూటింగ్ లొకేషన్స్ నుంచి కొంతమంది కావలనే మేకింగ్ వీడియోలని, ఫొటోలని సోషల్ మీడియాలో పెడుతుండటం వల్ల ఈ సినిమాలకి బాగా నష్టం వచ్చే అవకాశాలున్నాయని చిత్రబృందం బాధపడుతున్నారట.
ఇక ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ ఎంతో పక్కాగా ప్లాన్ చేసి షూటింగ్స్ జరుపుతున్నా కూడా ఇలాంటి లీకుల వల్ల కథ తెలిసిపోయి సినిమా మీద క్రేజ్ తగ్గే అవకాశాలున్నాయని భావిస్తున్నారట. కానీ పవన్ బంపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది. ఈ మూవీ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొని ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే కొన్ని సార్లు మాత్రమే ఇలా లీకవడం వల్ల ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. ఏదేమైనా ప్రేక్షకుల్లో మాత్రం సినిమా పట్ల ఆసక్తి తగ్గడం మాత్రం పక్కా అనే భయం చిత్ర వర్గాల్లో నెలకొందట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!