ఆరు వేల మందితో శృంగారం.. చివ‌రికి ఆ ప‌నిచేస్తూనే?

జీవిత కాలంలో ఓ వ్య‌క్తి ఎంత మందితో శృంగారంలో పాల్గొంటారు అని ఎవ‌రినైనా అడిగ‌తే ఒక‌రు ఇద్ద‌రు.. ముగ్గురు అని సమాధానం రావ‌డం స‌హ‌జం. గ‌తంలోనూ.. “మీ జీవిత‌కాలంలో ఎంత మందితో శృంగారం చేశారు.. మీ సంఖ్య ఎంత?” అంటూ ప‌లు అంశాల‌ను జోడించి సినిమాలు సైతం వ‌చ్చాయి. అయితే, గ‌తంలో ఓ వ్య‌క్తి తాను ఆరు వేల మందితో శృంగారంలో పాల్గొన్నాన‌ని వ్యాఖ్యానిస్తూ.. సంచ‌ల‌నంగా మారాడు. ఎవ‌రు ఆ వ్య‌కి? అంత‌మందితో ఎలా శృంగారం చేశాడు? ఆ ప‌నిచేస్తుంటేనే ఏం జ‌రిగింది ? ఇప్పుడు వైర‌ల్ కావ‌డానికి కార‌ణ‌మేంటి? ఆ ప్లేబాయ్‌కి సంబంధించిన ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం…!

ఇట‌లీకి చెందిన మారిజియో జింఫాంటి త‌న 60 ఎళ్ల జీవిత కాలంలో దాదాపు ఆరు వేల మంది అమ్మాయిల‌తో శృంగారంలో పాల్గొన్నాడు. అవును వీరు చ‌దివింది నిజ‌మే ! స్వయంగా అత‌నే ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. చివ‌రికి శృంగారం చేస్తూనే ప్రాణాలు వొదిలాడు ఈ ప్లేబాయ్ !

17 ఏళ్ల వ‌య‌స్సులోనే జింఫాంటి ఇట‌లీలోని ఓ నైట్ క్ల‌బ్‌లో ఉద్యోగానికి చేరాడు. అమ్మాయిల‌తో ప‌రిచయం పెంచుకుని వారిని నైట్ క్ల‌బ్‌కు వ‌చ్చేలా చేయ‌డం అత‌ని ప‌ని. దీంతో రంగంలోకి దిగిన ఈ ప్లేబాయ్.. అమ్మాయిల‌తో ప‌రిచ‌యం పెంచుకోవ‌డం.. వారిని నైట్ క్ల‌బ్‌కు తీసుకురావ‌డంలో రికార్డుల‌ను బ్రేక్ చేశాడు. ఇదే స‌మ‌యంలో అక్క‌డి వాతావ‌ర‌ణానికి అల‌వాటు ప‌డిన జింఫాంటి.. తాను ప‌రిచ‌యం పెంచుకున్న వారిలో చాలా మందితో శృంగారంలో పాల్గొన్నాడు. దీంతో అత‌ను దేశ విదేశాల్లోనూ పాపులారిటీ సంపాదించాడు. ఓ ఇంట‌ర్వూలో తాను 6 వేల మందితో శృంగారంలో పాల్గొన్నాన‌ని వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నం సృష్టంచింది.

ఈ క్ర‌మంలోనే ఇట‌లీలో ఫేమ‌స్ ల‌వ‌ర్ బాయ్‌, ప్లేబాయ్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఆ స‌మ‌యంలో చాలా మంది అత‌నితో ప‌రిచ‌యాలు పెంచుకోవడానికి ఆస‌క్తి చూపేవారంటే అత‌ను ఎంత‌లా ఆ దేశంలో ప్ర‌భావం చూపాడో అర్థం చేసుకోవ‌చ్చు. 59 ఏండ్ల వ‌ర‌కూ ఆ వృత్తిలో కొన‌సాగిన జింఫాంటి.. దాన్ని వ‌దిలేసి.. ఓ ట్రావేల్ కంపెనీలో చేరాడు. ఇక్క‌డ కూడా ల‌వ‌ర్ బాయ్ త‌న‌న్ని కొన‌సాగించాడు. ఈ క్ర‌మంలోనే అతి త‌క్కువ స‌మ‌యంలోనే దాదాపు 600 మందికిపైగా మ‌హిళ‌ల‌తో శృంగారంలో పాల్గొన్నాడు. ఇదిలా కొన‌సాగుతుండ‌గా త‌న 60వ ఏటా ఓ 23 ఏళ్ల యువ‌తితో శృంగారంలో మునిగితేలుతుండ‌గా.. జింఫాంటికి హ‌ర్ట్ ఎటాక్ వ‌చ్చింది. వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ప్ప‌టికి ఫ‌లితం లేకుండా పోయింది.

దాదాపు అన్ని దేశాల్లోనూ క‌రోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌గా.. అనూహ్యంగా జింఫాంటి క‌థ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. బ‌తికిన‌న్న‌ళ్లు శృంగారంలో మునిగి తేలిన జింఫాంటి… చివ‌రికీ అదే ప‌నిచేస్తూ ప్రాణాలు కొల్పోయాడ‌ని కామెంట్స్ వ‌స్తున్నాయి.