నెలకు రూ.2 వేలు కడితే రూ.లక్ష లోన్.. ఎలా అంటే?

పండగ సీజన్ కావడంతో బిసినెస్ చేసే వారు వారి వ్యాపారాన్ని, పబ్లిసిటీని పెంచుకొనికే ఎన్నో ఆఫర్స్ తో కస్టమర్స్ కు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో ఆఫ్ లైన్ కు ధీటుగా ఆన్లైన్ మార్కెట్ పోటీ పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళ వ్యాపారాన్ని, కస్టమర్లను పెంచుకోవడానికి ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ లిస్ట్ లో ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా చేరి హడావిడి చేస్తున్నాయి.

తక్కువ వడ్డీ రేట్లతో బ్యాంకులు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ లిస్ట్ లో ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ చేరింది. అదిరిపోయే బ్యాంక్ లోన్ ఆఫర్స్ తో కస్టమర్లను తమ వైపుకు తిప్పుకొంటోంది. దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్ ఆఫర్‌ పేరిట తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తోంది. ఈ సరికొత్త ఆఫర్‌లో భాగంగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 6.90% నుంచి వసూలు చేస్తోంది. అదే వెహికల్ లోన్ తీసుకుంటే 7.99% నుంచి వడ్డీ రేట్ వసూలు చేస్తోంది.

మీరు వెహికల్ తీసుకోవలంటే మాత్రం మంచి ఆఫర్ అందిస్తోంది. వెహికల్ ఆన్‌ రోడ్ ధర మొత్తాన్ని బ్యాంక్ నుంచి లోన్ రూపంలో తీసుకునే ఛాన్స్ ఇస్తోంది. అదే కాకుండా టూవీలర్ లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం మంచి ఈఎంఐ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ యాప్ ద్వారా తొలి ట్రేడ్ లేదా సిప్ ట్రాన్సాక్షన్ చేస్తే ఎడ్జ్ రివార్డ్ పాయింట్లు కూడా పొందే అవకాశాన్ని కల్పించింది.

ఇప్పటికే ఆన్లైన్ షాపింగ్ లో క్రెడిటీ లేదా డెబిట్ కార్డ్ నుంచి షాపింగ్ చేస్తే ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈఎంఐ లో అయితే జీరో ప్రాసెసింగ్ తో 3 లేదా 6 నెలల వాయిదాల రూపంలో చెల్లించొచ్చు. పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే 10.49% వడ్డీ రేట్ నుంచి ప్లన్స్ ను అందిస్తోంది. లక్ష రూపాయలకు ఈఎంఐ రూ.2,149 చెల్లించాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్‌పై వడ్డీ రేటు 10.5% ఉంది. బిజినెస్ లోన్లో ప్రాసెసింగ్ ఫీజులో 25 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. క్యాపిటల్ లోన్ లో ప్రాసెసింగ్ ఫీజులో 50% డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కల్పించింది. ఇంకెందుకు ఆలస్యం ఒకసారి యాక్సిస్ బ్యాంక్ కు వెళ్లి వివరాలు కనుక్కోండి.