సినిమా వాళ్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..!

సినీ నటుడు, ప్రముఖ రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ తరచూ ప్రజల సమస్యలపై స్పందిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో తనదైన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇతని ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి సోషల్ మీడియాలో పవన్ ఇంటర్వ్యూ ఇచ్చిన కూడా అది కాస్తా రోజంతా హల్ చల్ చేస్తూ ఉంటాయి. అలాంటి పవన్ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సినిమా వారిపై కొన్ని ఆసక్తికర కామెంట్ చేశాడు.

 

మంచి మనసుతో ముందుకొచ్చారు

హైదరాబాద్ వరద బాధితుల సహాయం కోసం సీఎం కేసీఆర్ అందరినీ సహాయనిధికి నిధులు ఇవ్వవలసిందిగా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అంతే ఒక్కసారిగా సినీ పరిశ్రమ నుండి లక్షల కోట్ల రూపాయలు వెల్లువెత్తాయి. అందరూ అద్భుతంగా స్పందించి కష్టాల్లో ఉన్న ప్రజలకు చేయూతనిచ్చారు. కొందరు కోట్లలో.. మరికొందరు లక్షల్లో విరాళాలు ఇచ్చారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తన వంతుగా కోటి రూపాయల విరాళం అందించారు. కానీ సినిమా వాళ్ళు ఆశించిన స్థాయిలో సహకారం అందించడం లేదని…. అందరూ అనుకున్నంత ఎక్కువ మొత్తంలో విరాళాలు రాలేదని విమర్శలు వచ్చాయి. వాటికి పవన్ ఇచ్చిన కౌంటర్ అదిరిపోయింది

ఇస్తుంది రూపాయల్లో కాదు.. లక్షల్లో కోట్లలో

ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కి ఈ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది – “సినిమా పరిశ్రమలో చాలా సంపద ఉందని ప్రజానీకం భావిస్తారని కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం జనాలకు సరిపడినంత సహాయం వారు ఇవ్వడం లేదని కొంతమంది విమర్శిస్తున్నారు,: అని యాంకర్ అడిగారు. అందుకు పవన్ తనదైన శైలిలో జవాబిచ్చారు. సరిపోయినంత ఇవ్వట్లేదు అంటే తనకు అర్థం కావడం లేదని చెప్పిన పవన్ నుంచి వారేమన్నా జేబు నుండి పది రూపాయలు తీసి ఇవ్వలేదని…. పది లక్షలు ఇవ్వాలి అంటే మనసు ఒప్పాలి కదా అని అన్నారు. ఇక నా వరకు చూసిన సేవాభావంతో ఉన్నా కాబట్టి కోటి రూపాయలు ఇచ్చాను అని చెప్పారు

అసలు కథానయకులు ముందు రారే…?

అంతేకాకుండా సినిమా వారు డబ్బులు పెట్టి లాభాలు వస్తే కోటి రూపాయలకి వారి చేతికి వచ్చేది 50 నుండి 70 లక్షలు మాత్రమేనని….మిగతాది టాక్స్ రూపంలో పోతుందని అదే నష్టం వస్తే మాత్రం మొత్తం గోవిందా అని వివరించారు. సినీ పరిశ్రమ వారు రాజకీయ నేతలతో, బిజినెస్ మెన్ తో పోల్చుకుంటే చాలా తక్కువ అని చెప్పారు. ఇందులో జీవితాలు నాశనం అయిపోయిన వారిని తన కళ్ళారా చూశాను అని ఆయన అన్నారు ఎలక్షన్ల సమయంలో కోట్లకు కోట్లు పెట్టి రాజకీయ నాయకులు ఈ సమయంలో ముందుకు రావడం లేదని వారు ముందుకు వస్తే ఎటువంటి సమస్య ఉండదని పవన్ అన్నాడు.