బిగ్ బాస్ ను నమ్ముకొని బుల్లితెర పైన స్పెషల్ ఈవెంట్ లు ప్లాన్ చేస్తున్నారు. ఇక స్టార్ మా లో వీరి చేరికతో జీ తెలుగు, ఈ టీవీ వంటి మేటి ఎంటర్టైన్మెంట్ చానల్స్ ను ఎదుర్కోవడానికి ఈ కంటెస్టెంట్ ల తో స్పెషల్ ఈవెంట్ కు రెడీ అయ్యారు.
ఈటీవీలో జబర్దస్త్ ఆర్టిస్టులు, రోజా, అనసూయ, ఆది వంటి వారు ఉన్నారు. జీ తెలుగు లో సీరియల్ ఫ్యామిలీ లు వచ్చాయి. వీరికి పోటీగా బిగ్బాస్ కంటెస్టెంట్ లు రెడీ అయిపోయారు. జీతెలుగు సంక్రాంతి సంబరాలు ఎనర్జిటిక్ హీరో రామ్ గెస్ట్ గా వచ్చి తన చిత్రం ‘రెడ్’ కి ప్రమోషన్స్ చేసుకున్నాడు. అయితే స్టార్ మా బిగ్బాస్ వారినితీసుకొనివచ్చి ఫ్యామిలీ లతోనే ఈవెంట్ నిర్వహించనున్నారు.
హీరోయిన్ సుహాసిని, కార్తీకదీపం హిమ ఫ్యామిలీల తో ఎమోషన్ బాగానే పండింది. అయితే స్పెషల్ అట్రాక్షన్ గా అభిజిత్ ఉన్నట్లు కనిపిస్తోంది. బిగ్బాస్ నాలుగవ సీజన్ విన్నత్ అయిన అభిజిత్ కు వచ్చిన క్రేజ్ చాలా ఎక్కువ. ఇప్పుడు అతనికి, అతని తల్లి కి ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరిపై విడుదల చేసిన ప్రోమో మరొక రేంజ్లో ఉంది అని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.
మొత్తంగా చూస్తే అభిజిత్ క్రేజ్ ను వాడుకొని ఈవెంట్ బంపర్ హిట్ అయ్యేలాగా స్టార్ మా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది