NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో ఐశ్వ‌ర్య పోటీ అక్క‌డ నుంచే… సీన్ రివ‌ర్స్ చేసిప‌డేసిన జ‌గ‌న్‌…!

వైసిపి అధినేత జగన్ ఒకవైపు అసెంబ్లీ.. ఇటు పార్లమెంటు నియోజకవర్గాల‌కు కొత్త అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 60కు పైగా నియోజకవర్గాలలో సమన్వయకర్తలను మార్చేశారు. కొంతమంది సమన్వయకర్తలకు స్థానాచలనం చేశారు. ఇలాంటి మార్పులు 60 కు పైగానే జరిగాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి చేరింది నెల్లూరు జిల్లాలోని కందుకూరు. ప్ర‌స్తుతం ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌పున మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డి ప్రాధినిత్యం వ‌హిస్తున్నారు.

అయితే జ‌గ‌న్ ఈ సారి కందుకూరు సీటును బీసీల‌కు ఇవ్వాల‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే మ‌హీధ‌ర్‌రెడ్డిని త‌ప్పించి కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంకు చెందిన యాద‌వ సామాజిక వ‌ర్గం నేత బోట్ల రామారావు యాద‌వ్‌కు సీటు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆర్థిక, అంగ బ‌లాల‌తో పాటు లోక‌ల్ నేప‌థ్యంలో రామారావు అయితే గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేడ‌ని భావించి ఆయ‌న్ను త‌ప్పించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ సారి ఓ లేడీ ఇక్క‌డ వైసీపీ నుంచి తెర‌మీద‌కు రావ‌డం విశేషం.

ఈసారి కందుకూరు నుంచి వైసీపీ తరఫున ఆదిశంకర ఇంజనీరింగ్‌ కాలేజీ అధిపతి డాక్టర్‌ వి.పెంచలయ్య కుమార్తె ఐశ్వర్య పోటీ చేస్తారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐశ్వర్య బీసీ సామాజికవర్గానికి చెందినవారు. వీరికి నెల్లూరు జిల్లా గూడూరులో ఆదిశంకర కాలేజ్ ఉంది. ఈ మేర‌కు జ‌గ‌న్ స‌మ‌క్షంలో డాక్ట‌ర్ వి. పెంచ‌ల‌య్య వైసీపీలో చేరారు. పెంచ‌ల‌య్య‌తో పాటు ఆయ‌న ఇద్ద‌రు కుమార్తెలు వి.అరవింద, డాక్టర్‌ వి.ఐశ్వర్య కూడా పార్టీలో చేరారు. మ‌హీధ‌ర్ రెడ్డి ప్రోత్సాహంతోనే వీరు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.

కందుకూరులో వైసీపీ జెండా ఎగ‌రాలంటే బ‌ల‌మైన క్యాండెట్ ఉండాల‌ని మ‌హీధ‌ర్ రెడ్డి భావిస్తున్నారు. నాన్ లోక‌ల్ క్యాండెట్ల‌తో పాటు అంత బ‌లం లేని వాళ్ల‌కు ఇస్తే సీటు పోయే ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించే మ‌హీధ‌ర్ రెడ్డి చ‌క్రం తిప్పి పెంచ‌ల‌య్య ఫ్యామిలీని వైసీపీలో చేర్పించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక కందుకూరు చ‌రిత్ర‌లోనే ఓ ప్ర‌ధాన పార్టీ ఫ‌స్ట్ టైం బీసీల‌కు సీటు ఇస్తోంది. ఇది కూడా ఇక్క‌డ పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం వైసీపీకి అనుకూలంగా క‌నిపిస్తోంది.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju