ప్రతి రోజు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడం తప్పనిసరి.. అయినా కొన్ని సార్లు తినడానికి కుదరదు. పని లేదా ఆఫీస్ హడావిడి లో పడి ఆలస్యం అవుతుందేమోనని బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే ఉంటారు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వీలుకాని సందర్భాల్లో బాదం పప్పు తినడం చాల మేలని తాజా అధ్యయనం ద్వారా తేలింది.
ఉదయాన్నే టిఫిన్ చేయకుండా బాదం పప్పు ఆహారం గా తీసుకున్న వారి బ్లడ్ షుగర్ స్థాయిలు మెరుగ్గా ఉన్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. విద్యార్థులు తొలిసారిగా చేపట్టిన ఈ అథ్యయనం లో బ్రేక్‌ఫాస్ట్ తీసుకోని వారు బాదంను స్నాక్‌గా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని వెల్లడించిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ రుడీ ఓర్టిజ్ తెలిపారు. ఆరోగ్యకర పోషకాల తో కూడిన బాదం అన్ని వయసుల వారికి మంచి స్నాక్‌గా అధ్యయనం సూచించింది.బాదం జ్ఞాపక శక్తి పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
బాదం పాలను ను నిద్ర పోయే ముందు త్రాగడం మంచిది.బాదం పాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం పాలల్లో ఆరోగ్య కరమైన కొవ్వులు ఎక్కువగా ఉండటం, సోడియం తక్కువగా ఉండటం, వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే చేప లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా బాదంలో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది బీపీ, గుండె జబ్బుల కు దూరం గా ఉంచుతుంది. బాదం తినడం వలన మన శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు అందడంతో పాటు శరీరం లో సెక్స్ హార్మోన్లను విడుదల అయ్యేలా చేస్తుంది. స్త్రీలల్లో కోరికలు పెరగడానికి బాదం బాగా పనిచేస్తుందని నిపుణుల అభిప్రాయం.