Jyothika : సినిమా ఇండస్ట్రీ లో సూర్య జ్యోతిక Jyothika కలిసి దాదాపు ఆరు సినిమాల్లో నటించడం జరిగింది. వీళ్లిద్దరు కలిసి చివరిసారిగా సిల్లును ఒరు కాదల్ అనే సినిమాలో నటించి తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిందే. సూర్యతో పెళ్లయిన తర్వాత చాలాకాలం సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఇదిలావుంటే ఇటీవల మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్ జ్యోతిక తనకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఎక్కువగా లేడి ఓరియంటెడ్ సినిమాలను చేస్తున్న హీరోయిన్ జ్యోతిక తాజాగా మళ్లీ భర్త సూర్యతో కలిసి సినిమా చేయడానికి రెడీ అయినట్లు తమిళ ఇండస్ట్రీ వర్గాల లో సరికొత్త టాక్ వినబడుతుంది.
మేటర్ లోకి వెళ్తే నారింజమిఠాయి అనే సినిమాని దర్శకత్వం చేసిన హలితా షమిమ్ తో కలసి ఈ జంట సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ ‘సిల్లు కరుపట్టి’ అనే సినిమాను తెలుగులో ‘నారింజమిఠాయి’ అనే పేరుతో డబ్ చేశారు. ఇటీవలే ఆహా వేదికగా ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో హలితా షమిమ్ పనితనం నచ్చడంతో .. సూర్య మరియు జ్యోతిక కలిసి ఆమెతో సినిమా చేయడానికి రెడీ అయినట్టు తమిళ మీడియా వర్గాలలో సరికొత్త టాక్ వినపడుతోంది. ఇదిలా ఉంటే సూర్య ఇచ్చిన ఆఫర్ కి హలితా షమిమ్ అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!