ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం ఆమెజాన్ సంస్థ ప్రజలకు తమ సేవలను అందిస్తూ అందరికీ చేరువవుతోంది. రోజు రోజుకూ సంస్థను విస్తరించుకుంటూ ఉన్నత శిఖరాన్ని అధిరోహించింది ఈ అమెజాన్ సంస్థ. భారీ ఆఫర్లు ప్రకటించేస్తూ చిన్న, మధ్య, ఉన్నత కుటుంబాలు అనే తేడా లేకుండా తమ వస్తువులను అందరికీ చేరువయ్యేలా చేస్తూ భారీ క్రేజ్ ను సంపాదించుకుంటుంది ఈ సంస్థ.
ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు వగైరాలు అందిస్తూ తమ కస్టమర్లను సంతోషింపజేస్తుంది అమెజాన్ సంస్థ. అయితే మరో కొత్త సర్వీసుతో ఈ ఈ కామర్స్ దిగ్గజం మనముందుకు రాబోతోంది. ఈ కొత్త సర్వీసును ఇప్పటికే అమలు చేయడం ద్వారా కొన్ని సంస్థలు పాతాలానికి కూడా వెళ్లాయి. ఈ కొత్త సర్వీసులేంటబ్బా అని అలోచిస్తున్నారు కదూ.. అదేనండి.. మెడిసిన్స్ ను కూడా ఆన్ లైన్ ద్వారా అందించడానికి సిద్ధమవుతోంది అమెజాన్.
అయితే ఇప్పటికే ఈ సర్వీసును అమెరికాలో కొనసాగిస్తోంది. దీంతో అక్కడి సంస్థలు వాల్ గ్రీన్స్, సీవీఎస్, వాల్ మార్ట్ వంటి డ్రగ్ రిటైలర్లకు భారీ షాక్ తగలబోతుందని అర్థమవుతోంది. అయితే ఈ సర్వీసులను ఈ సంస్థ అమెజాన్ ఫార్మసీ పేరుతో అందిస్తున్నది. కాగా ఈ మెడిసిన్స్ తమ ఇంటికే అందించే సర్వీసులను ప్రపంచ వాప్తంగా విస్తరించేందుకు చర్యలు తీసుకోబోతోంది ఈ సంస్థ. అయితే ఈ మెడికల్ సర్వీసులను పొందాలంటే మాత్రం అమెజాన్ ఫార్మసీ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్ చేసి పొందవచ్చు.
దీనితో పాటుగా అమెజాన్ ఇప్పటికే తమ కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేస్తోంది. అలాగే మెడిసిన్స్ విషయంలో కూడా డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇదిలా ఉంటే మెడిసిన్స్ ను కొనుగోలు చేసే లాయల్టీ క్లబ్ వారి భారీ డిస్కౌంట్ ను కూడా అందివ్వనున్నట్టు అమెజాన్ ప్రకటించేసింది. అయితే ఈ సర్వీసులను అందివ్వడానికి రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నామని అమెజాన్ వెల్లడించింది.