18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
జాతీయం న్యూస్

Amit Shah : అమిత్ షాకి సీక్రెట్ నివేదిక..! ఢిల్లీ అల్లర్లు వెనుక గ్యాంగ్ స్టర్..!!

Share

Amit Shah  : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం ఢిల్లీలో రైతుల ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

amith shah secret report to amit shah gangster behind delhi riots
amith shah secret report to amit shah gangster behind delhi riots

రైతులకు మద్దతుగా పంజాబ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలతోపాటు తెలంగాణ నుంచి కూడా పలువురు ఉద్యమకారులు వెళ్లారు.కాగా, మంగళవారం జరిగిన రిపబ్లిక్ డే ట్రాక్టర్ ర్యాలీలో పంజాబీ నటుడు దీప్ సిద్ధు నిరసనకారులను ప్రేరేపించి ఎర్ర కోటకు నడిపించారని రైతు నాయకులు ఆరోపించారు. దీప్ సిద్దుఎవరు, రైతుల ఆందోళనలో ఆయన ఎలా భాగమయ్యారు అనే దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది

Amit Shah : రెచ్చగొట్టి రూట్ మార్చిన సిద్ధూ!

.రైతుల ట్రాక్టర్ ర్యాలీలో భాగంగా నిరసనకారులు ఎర్రకోటపై దూసుకెళ్లేందుకు సిద్ధూ చేసిన వ్యాఖ్యలే కారణమని రైతు నాయకులు ఆరోపించారు. పంజాబ్ ‌రాష్ట్రానికి చెందిన నటుడు దీప్ సిద్ధు ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో, “మేము నిషాన్ సాహిబ్ను ఎర్ర కోట వద్ద మాత్రమే ఎగురవేసాము, మన ప్రజాస్వామ్య నిరసన హక్కును వినియోగించుకున్నాము, భారత జాతీయ జెండా తొలగించాలి.” అంటూ ప్రసంగం చేశారు. ఇది నిరసనకారులను మరింత ప్రేరించిందని రైతుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.రిపబ్లిక్ డే రోజు చేపట్టిన రైతుల ఆందోళన అదుపుతప్పింది. రైతు నాయకులు కూడా ఎర్రకోటపైకి దూసుకువస్తున్నవారిని రైతు సంఘాల నేతలు విడదీయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కాగా, ఆందోళనకారులతో హింసాత్మక ఘర్షణల్లో 83 మంది సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఇదిలావుంటే, ఆందోళనకు ముందు రాత్రి సింగు సరిహద్దు నిరసన స్థలంలో దీప్ సిద్దూ, గ్యాంగ్ స్టర్ గా మారిన రాజకీయ నాయకుడు లఖా సిధానా కూడా నిరసనకారులను ప్రేరేపించడానికి ప్రయత్నించారని రైతు సంఘాల నేత స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ అన్నారు. “డీప్ సిద్దుమైక్రోఫోన్‌తో ఎర్రకోటను ఎలా చేరుకున్నారనే దానిపై దర్యాప్తు ప్రారంభించాలని యాదవ్ డిమాండ్ చేశారు. దీప్ సిద్దునిరసనకారులను ప్రేరేపించారు, కిసాన్ ట్రాక్టర్ ర్యాలీని తప్పుదారి పట్టించారని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు), హర్యానా చీఫ్ గుర్నమ్ సింగ్ చాదుని ఆరోపించారు.

Amit Shah : నటుడు …న్యాయవాది కూడా!

1984 లో పంజాబ్‌లోని ముక్త్సర్ జిల్లాలో జన్మించిన దీప్ సిద్దు న్యాయవిద్యను అభ్యసించారు. కింగ్‌ఫిషర్ మోడల్ హంట్ అవార్డును గెలుచుకునే ముందు అతను కొంతకాలం బార్‌లో పనిచేశాడు. 2015 లో దీప్ సిద్ధు తొలి పంజాబీ చిత్రం – రామ్‌తా జోగిలో నటించారు. 2018లో అతను సిద్దు నటించిన జోరా దాస్ నుంబ్రియా చిత్రం మంచి ప్రజా ఆదరణ పొందింది. ఇందులో అతను గ్యాంగ్ స్టర్ ప్రధాన పాత్రను పోషించాడు.కాగా, 2019 లో గురుదాస్‌పూర్ ఎన్నికల ప్రచారంలో బిజెపి ఎంపి సన్నీ డియోల్ మద్దుతుగా నిలిచాడు.దీంతో సిద్ధూకు బిజెపి నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరోవైపు ప్రధాని మోడీతో సిద్ధూ ఉన్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సిద్దూ తో సంబంధాలు లేవన్న ఎంపీ!”

ఇదిలా ఉండగా ఎర్రకోట సంఘటనపై ఎంపీ సన్నీ డియోల్ ఒక ట్వీట్లో మంగళవారం విచారం వ్యక్తం చేశారు.అంతేగాక “నేను ఇంతకు ముందు, డిసెంబర్ 6 న ట్విట్టర్ ద్వారా నాకు లేదా నా కుటుంబానికి డీప్ సిద్ధుతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసిన విషయాన్ని తాజా ట్వీట్లో గుర్తుచేశారు.

ఆది నుండి రైతులను అనుసరిస్తున్న సిద్ధూ!

గత ఏడాది సెప్టెంబర్ 25న ఢిల్లీ సరిహద్దులోని శంబులో రైతుల ఆందోళనలో పాల్గొనాలని పలువురు కార్యకర్తలు, కళాకారులు నిర్ణయించారు. రైతులతో పాటు శంబు సరిహద్దు వద్ద ధర్నాలో కూర్చున్న కళాకారులలో డీప్ సిద్దుఉన్నారు. ఆ తరువాత అతను శంబు సరిహద్దు వద్ద శాశ్వత ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు. రైతుల ఆందోళనలపై పంజాబ్ రాష్ట్రం గురించి మాట్లాడటానికి తనొక సోషల్ మీడియా బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మొదట అనేక మంది రైతుల సంఘాలు దీప్ సిద్ధు ప్రమేయాన్ని వ్యతిరేకించాయి. “బిజెపి-ఆర్ఎస్ఎస్ ఏజెంట్” అని ఆరోపించారు. అయితే, అప్పట్లోనే డీప్ సిద్ధు ఈ ఆరోపణలను ఖండించారు.కాగా మేము దీప్ సిద్ధును మొదటి నుండి వ్యతిరేకించామని, అతనితో రైతు సంఘాలతో సంబంధంలేదని రైతు ఉద్యమ నేత యోగేంద్ర యాదవ్ అన్నారు.ప్రస్తుతం డీప్ సిద్ధూ వ్యవహారమే ఆసక్తికరంగా మారింది!

 


Share

Related posts

ఆమె మనసు చల్ల”నిధి”..! దానం అరుదైనది..! అమ్మలకే స్ఫూర్తినిచ్చిన అమ్మ కథ..!!

Vissu

Samantha – Nayanatara: సమంత, నయనతారలలో ఎవరు బెస్ట్ ..ఈ దెబ్బతో తేలిపోతుంది..

GRK

Horoscope : Today Horoscope ఫిబ్రవరి – 5 – శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha