న్యూస్

ఏం జరిగింది అక్కడ!?

Share

న్యూ ఢిల్లీ: మునిసిపల్ అధికారిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన బిజెపి శాసనసభ్యుడి ఉదంతంపై నివేదిక పంపాల్సిందిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ బిజెపి శాఖను ఆదేశించారు. బుధవారం ఇండోర్ నగరంలో అందరూ చూస్తుండగా మునిసిపల్ అధికారిపై దాడి చేసినందుకు ఆకాశ్ విజయవర్గియను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పెంపారు. న్యాయస్థానం ఆయనకు బెయిల్ నిరాకరించింది. ఫశ్చిమ బెంగాల్ బిజెపి వ్యవహారాల ఇన్‌ఛార్జ్ అయి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియ కుమారుడు ఆకాశ్.

ఆకాశ్ ఆగ్రహానికి గురయిన మునిసిపల్ అధికారి ఆక్రమణల తొలగింపు బృందంలో సభ్యుడు. ఈ సంఘటన తర్వాత ఆకాశ్  మీడియాతో మాట్లాడుతూ, ముందు సమస్య నివేదిస్తాం. తర్వాత దండిస్తాం. అదే బిజెపిలో మాకు నేర్పింది అన్నారు. ఈ సంఘటన బిజెపికి చెడ్డపేరు తెస్తోందనీ, పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాత చర్య తీసుకుంటామనీ ఒక సీనియర్ బిజెపి నేత చెప్పినట్లు ఎన్‌డి టివి తెలిపింది.

ఆకాశ్ విజయవర్గియ దాడి వీడియో కింద చూడవచ్చు:

Video Courtesy: Hindusthan Times


Share

Related posts

ఆ డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా ఎందుకు కేన్సెల్ అయింది??

Naina

Gas cylinder: గ్యాస్ సిలిండర్ ఇంకా ఎన్ని రోజులు వస్తుందో ఇలా చెక్ చేసుకోండి!!

Kumar

పార్టీ మారే ఆలోచనలో కన్నా లక్ష్మీనారాయణ..??

sekhar

Leave a Comment