చింతమనేని అనుచరులపై అపూర్వ ఫిర్యాదు

హైదరాబాద్ డిసెంబర్ 25: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనను మానసికంగా వేధిస్తున్నారని సినినటి అపూర్వ సైబర్ క్రైం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్యప్రచారం చేస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని తనను వేధించే వారిపై చర్యలు తీసుకోవాలని కొరారు.