RGV: ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై యాంకర్ల సంఖ్య చాలా తక్కువనే చెప్పుకోవాలి. అందులోనూ మంచి వాగ్ధాటి కలిగిన యాంకర్లు ఇంకా తక్కువ. అయితే అందులో ఒకరైన శ్యామల గురించి అందరికీ తెలిసినదే. ఈమె మంచి కూల్ యాంకర్ అని చెప్పుకోవాలి. అందుకే తనకంటూ ప్రత్యేక గుర్తింపు వుంది. అప్పుడప్పుడూ ఈవెంట్స్ చేసుకుంటూ.. మధ్యలో కొన్ని సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేయడం శ్యామల ఇంకో ప్రత్యేకత. దాంతో పాటు రాజకీయాలలో కూడా అమ్మడు కాలు పెట్టింది. YCPలో భర్తతో కలిసి తాజాగా జాయిన్ అయిన విషయం తెలిసినదే.
RGV: అరియానా, అషూలకు ఆర్జీవీ షాక్.. బిగ్బాస్లో ఈసారి సపోర్ట్ ఆ వ్యక్తికే!
RGV: ఏ సందర్భంగా ఆమె వర్మ గురించి మాట్లాడిందో?
ఇకపోతే ఈమెకు యూట్యూబ్లో సొంతంగా ఛానల్ వున్న విషయం తెలిసినదే. అది నిర్వహిస్తూనే.. మరోవైపు ఇన్స్టాలో ఫాలోవర్లతో ఆమె తరచూ ఎంగేజ్ అవుతూ ఉంటుంది. అవును.. తాజాగా మరోసారి ఇన్స్టాలో ఫాలోవర్లతో లైవ్ చాట్ చేస్తున్న సమయంలో శ్యామల ఓ విచిత్రమైన ప్రశ్నను ఫేస్ చేసారు. ఓ నెటిజన్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పమని అడిగాడు.. అందుకు శ్యామల తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది.
RGV: రామ్ గోపాల్ వర్మ ఎంత మంది అమ్మాయిలతో ఉన్నాడు ఈ ప్రశ్నకి ఊహించని సమాధానం చెప్పిన వర్మ సోదరి!
వర్మ గురించి శ్యామల మాట ఇదే!
ఈ మధ్య వీరు ఇద్దరూ కలిసి ఓ వేడుకలో కాస్త ఫన్ క్రియేట్ చేసారు. దాంతో అప్పట్నుంచి ఈ ఇద్దరి మీద ఫోకస్ పెట్టింది మన సోషల్ మీడియా. విలేఖరి అడిగిన దానికి ఆమె నో కామెంట్స్.. అని చెబుతూనే ఆయన గొప్ప దర్శకుడు.. ఆయన చిత్రాలకు నేను పెద్ద అభిమానిని అంటూ రిప్లై ఇచ్చింది. శ్యామల ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.