Chiranjeevi: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో చిరంజీవి తన సొంత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తనతోపాటు భార్య సురేఖ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తన తల్లికి 16 సంవత్సరాలు రాకముందే తాను పుట్టినట్లు పేర్కొన్నారు. ఇంట్లో అన్ని పనులు అమ్మే చేసేది అని చెప్పుకొచ్చారు. ఎన్ని పనులు చేసినా కష్టపడిన ఎటువంటిది కోరుకోరని పేర్కొన్నారు.
ఈ క్రమంలో మహిళల కోసం ఏదైనా ఓ కార్యక్రమం చేయాలని సురేఖ చెప్పటంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు. కెరియర్ పరంగా హీరోగా ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం భార్య సురేఖ నే అని చెప్పుకొచ్చారు. తాను కూడా ఫెమినిస్టుని.. అయిపోయాను ఏమో అని కొన్ని సందర్భాలలో కనిపిస్తుందని తెలిపారు. అల్లు వారి ఇంటిలో సురేఖ అందరి కంటే చిన్న బిడ్డ. పైగా గారాలపట్టి. కానీ పెళ్లయిన తర్వాత మా కుటుంబంలో సురేఖ పెద్దకోడలు. పెళ్లి చేసుకున్నారా కుటుంబం మొత్తాన్ని ఆమె చూసుకోవటం జరిగిందని… సినిమా రంగంలో విజయవంతంగా రాణించటానికి కారణం ఆమె అని స్పష్టం చేశారు.
పుట్టినిల్లు అదేవిధంగా మెట్టినిల్లు బాధ్యతలను మహిళలు తీసుకుని చాలా ఆదర్శంగా నిలుస్తారు అని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో అంతరిక్షంలో కూడా మహిళల వెళ్తున్నారని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు గొప్ప విజయాలు సాధిస్తున్నారు అని చంద్రమండలం మరియు ఒలంపిక్స్ స్థాయికి మహిళలు ఎదిగారని చిరంజీవి ప్రశంసించారు. ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు కోరారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!