ఏపి గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 23 నుండి 29 వరకూ జరగాల్సి ఉన్న గ్రూప్ 1 మెయిన్స్ ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్‌సీ. జూన్ 3 నుండి 9 వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ వెల్లడించింది. 2022 సివిల్స్ ఫేజ్ – 3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుండి మే 18 వరకూ ప్రకటించడంతో గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్ ను యూపీఎస్సీ సోమవారమే విడుదల చేసింది.

యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకు ఏపి నుండి దాదాపు 25 మంది గ్రూప్ 1 అభ్యర్ధులు హజరు అవుతున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూల కారణంగా గ్రూప్ 1 మెయన్స్ ని జూన్ లో నిర్వహించాలని నిర్ణయించింది ఏపీపీఎస్సీ. సివిల్స్ ఇంటర్వ్యూలకి ఎంపికైన అభ్యర్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే మెయిన్స్ వాయిదా వేసినట్లుగా ఏపీపీఎస్సీ సభ్యుడు సలాంబాబు తెలియజేశారు.
కీలక నిర్ణయాన్ని ప్రకటించిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి