ప్రస్తుతం సెలబ్రెటీల పుట్టినరోజులు అనగానే మనకి గుర్తొచ్చే ప్లేసులు బీచ్ రోడ్స్, పబ్బులు అని చెప్పవచ్చు. కాస్త సెంటిమెంట్ గా ఆలోచించే సెలబ్రిటీలైతే మాత్రం వారి పుట్టినరోజును తమకిష్టమైన దేవుడి గుడిలో జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ ట్రెండ్ ను మార్చేసిందో హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ స్మశాన వాటికలో పుట్టినరోజు జరుపుకొని కొత్త ట్రెండ్ సెట్ చేసింది. స్మశాన వాటికలో పుట్టినరోజు వేడుకలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం మీరు చదవాల్సిందే!
ఆర్యా ఘరే
బాలీవుడ్ నటి ఆర్యా ఘరే తన పుట్టినరోజు వేడుకను స్మశాన వాటికలో జరుపుకొని అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆర్యా ప్రస్తుతం మరాఠీ సినిమాలలో నటిస్తోంది. అయితే నిన్న ఆర్యా 22వ పుట్టినరోజు వేడుక జరుపుకుంది. అందరిలా పబ్ లోనో, ఇంట్లోనో లేదా రెస్టారెంట్లోనో జరుపుకుంటే స్పెషల్ ఏముంది అనుకుందో ఏమో కానీ ఏకంగా ఈ ముద్దుగుమ్మ ఏకంగా స్మశానం లోనే తన పుట్టినరోజు జరుపుకుంది. దానికి సంబంధించిన కారణాలను కూడా ఆమె చెబుతుంది.
అందుకే అలా చేసిందట
ప్రస్తుతం ఆర్యా మూఢనమ్మకాలకు విరుద్ధంగా ఒక సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కలిసి వస్తాయని, అంతే కాకుండా మూఢనమ్మకాలను నమ్మకండి అంటూ ప్రజలకు తెలియజేయాలని ఆమె స్మశానంలో తన పుట్టినరోజు జరుపుకుంది. మహారాష్ట్ర పూణేలోని పింప్రి చించ్ వడ్ లోని ఒక స్మశాన వాటికలో ఆర్యా తన పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ వెరైటీ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు మూవీ డైరెక్టర్, ఆర్యా తల్లి, ఆమె ఫ్రెండ్స్ అటెండ్ అయ్యారు. ఇంతవరకు బానే ఉంది కానీ ఇదంతా చూసిన ప్రజలు మాత్రం ఆమెకి కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు. కొంతమంది ప్రజలు మూఢనమ్మకాలు లేవని నమ్మించడానికి ఇలాంటి చెత్త ప్రయోగాలు చేయొద్దు అని తిట్టిపోస్తున్నారు. మరి చేసిన దాంట్లో తప్పేముందని సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఏదైతేనేం ఆర్య మాత్రం తన బర్త్‌డే ని స్మశాన వాటికలో జరుపుకొని కొత్త ట్రెండ్ ని సృష్టించింది. ప్రస్తుతం ఈ వార్త మరాఠీ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!