నీటిని కుండా లో ఉంచడం వలన సహజంగా చల్లబడతాయి. ఇక వేసవిలో అయితే దాహం తీర్చుకోవడానికి, ఎండ తాపం నుంచి ఈ బయట పడటానికి సహజమైన ఈ చల్లని నీరు తాగడమే ఆరోగ్యానికి మంచిది.
- సహజ మినలర్స్ కుండ నీటిలో మాత్రమే ఉంటాయి.అవి శరీరానికి అదనపు శక్తిని ఇచ్చి ఎలక్ట్రోలైట్స్‌ను నష్టపోకుండా చేస్తాయి.
- సహజంగా చల్లబడే నీటికి ఇమ్యూనిటీ గుణాలు అధికంగా ఉంటాయి.
- ఈ నీరును తాగడం వల్ల సహజంగా శరీరానికి ఆల్కలైన్ అందుతుంది. అనారోగ్యాలు దరి చేరకుండా చేస్తుంది.
- మెటబాలిజం పెరుగలంటే మట్టి కుండలో నిల్వ ఉంచిన నీరు తాగడం తాగవలిసిందే. ఈ కుండా లో నీటితో ముఖం కడుక్కుంటే చర్మం మృదువుగా మారుతుంది
- ప్లాస్టిక్ బాటిల్స్‌లో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
- మట్టికుండలో చల్లబడే నీటి లో ఎలాంటి రసాయనాలూ ఉండవు. శరీరానికి ఎలాంటి హానీ జరుగదు.
అయితే ఆ మట్టి నీటి కుండా ఇంట్లో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమవుతాయని వాస్తుశాస్త్రం తెలియచేస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో మట్టి కుండలో నీటిని నిల్వ చేసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి అని తెలియచేస్తున్నారు వాస్తు నిపుణులు. వాస్తుశాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో మట్టి కుండలో నిండుగా నీరు ఉంచితే ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయని వాస్తుశాస్త్రం తెలియచేస్తుంది.
మీరు ఎప్పటికీ ధనవంతులు గానే ఉంటారట.అయితే పెద్ద కుండ కాకపోయినా చిన్న పాటి మట్టికుండనైనా సరే తెచ్చుకుని ఇంట్లో ఉత్తర దిశన ఆ కుండా ఉండేలా పెట్టుకోవాలి. అయితే కుండ మాత్రం ఎప్పుడూ నీటితో నిండుగా ఉండేవిధం గా చూసుకోవాలి.అలా ఉంటే అప్పులు తీరి,డబ్బు నిల్వ ఉండి ప్రశాంతం గా ఉంటారు. మంచి ఆరోగ్యం,సంపద పొందాలంటే ఇలా చేసి చూడండి …