సహజం గా ఎవరైనా బరువు పెరిగితే… ఆటోమేటిక్‌గా ఫేస్ కూడా లావు అవుతుంది. కానీ కొందరు శరీరం సన్నగా ఉన్నాకూడా పేస్ లావుగా కనిపిస్తుంది. మన శరీరం 70 శాతం నీళ్లతో నే ఉంటుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి నీళ్లు అందించడం ఎంతో అవసరం. సన్నబడాలన్నా కూడా రోజు మొత్తం లో వీలైనన్ని ఎక్కువ గ్లాసుల నీళ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖం లో ఉండే కొవ్వును తగ్గించడానికి కూడా నీళ్లు బాగా ఉపయోగపడతాయి. అందుకే ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా ఎప్పుడూ ఒక నీళ్ళ బాటిల్ ఉంచుకోవాలి. లేదంటే నీళ్లు తాగాలనే ఆలోచన మనసులోకి రాదు. నీళ్లు తాగము.. కొవ్వును తగ్గించుకోవాలంటే మాత్రం రోజులో కనీసం రెండు లీటర్ల నీళ్లైనా తాగాలి.రోజువారీ వ్యాయామం తో పాటు చూడచక్కటి ముఖం కోసం చిన్నపాటి ఎక్సర్‌సైజ్‌లుచేయాలి. ముఖ్యంగా గడ్డం కింద పెరిగే కొవ్వుకు తగిన జాగ్రత్త తీసుకోవాలిసిందే..
ముఖంలో కొవ్వును పోగొట్టడం కోసం ఈ వ్యాయామం చెయ్యండి.నెమ్మదిగా మీ ముఖాన్ని వెనక్కి వంచండి. మీ గడ్డాన్ని ముందుకు పైకి వచ్చేలా ఉండాలి .
ఇప్పుడు మీ రెండు బుగ్గల్నీ నోటి లోపలికి వీలైనంతగా లాక్కోండి. ఇలా 5 సెకండ్లపాటూ బుగ్గల్ని అలాగే లోపలికి లాగి ఉంచండి. ఇలా రోజూ మొత్తం లో 15 సార్లు చెయ్యండి.
ఇలా చేయడం మొదలు పెట్టగానే కొవ్వు మొత్తం కరిగిపోదు అని గుర్తుపెట్టుకోవాలి. క్రమ క్రమం గా మార్పు వస్తుంది. కొన్ని రోజులకు ముఖం లో వచ్చిన తేడా స్పష్టం గా కనిపిస్తుంది. ఇలా చేస్తూనే, నూనె తో చేసిన పదార్ధాలు తగ్గించాలి.. నీరు బాగా తాగాలి.ఆహారం లో ఆకుకూరలు, కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి. డ్రింకింగ్ ,స్మోకింగ్ మానేయాలి. ఆరోగ్యకరమైన జీవన విధానం లేనప్పుడు… కొవ్వు తగ్గదు. అందువల్ల ఈ జాగ్రత్తలు పాటిస్తూఆరోగ్యంగా అందం గా ఉండండి.
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…
Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ ...…