ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో యాష్ హీరో గా వచ్చిన కేజిఫ్ 1 సినిమా ఇండియా వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే. అయితే కెజిఫ్ చాప్టర్ 2 కోసం దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.
బాహుబలి తరువాత ఆ రేంజులో ఒక పాన్ ఇండియా సినిమా ఇంత ఫేమస్ అవ్వడం ఇదే మొట్టమొదటి సారి అని చెప్పుకోవచ్చు. సంజయ్ దత్ ని అలాగే రవీనా టండన్ ని చాప్టర్ 2 లో తీసుకోవడం వలన బాలీవుడ్ లో కూడా ఈ సినిమా కి భారీ హైక్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ కూడా నడుస్తూ ఉంది. అలాగే ఆ బిజినెస్ లు కూడా భారీ స్థాయి లో ఉన్నాయి.
ప్రస్తుతం టీజర్ రెండు గంటల క్రితం లీక్ అయ్యింది. దాంతో ఇంక సినిమా బృందం వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే టీజర్ రిలీజ్ కి సిద్దపడి తమ అఫిషియల్ ఛానల్ లో ఈ సినిమా కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన అయిదు పది నిమిషాలలోనే లక్షలాది మంది టీజర్ ను చూస్తున్నారు.
టీజర్ లో యాష్ మళ్ళి తన రౌద్రాన్ని చూపించాడు. ప్రశాంత్ నీల్ తనదైనటువంటి శైలి లో మంచి ఎమోషన్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ ను సెకండ్ పార్ట్ లో కూడా అదితిరిపోబోతున్నాయని క్లియర్ కట్ గా చూపించాడు. ఈ సినిమా సెకండ్ పార్ట్ టీజర్ ఇండియా వైడ్ సూపర్ హిట్ అవుతునటువంటి నేపథ్యంలో మీకోసం కింద లింక్ ఇవ్వబడుతుంది.
https://www.youtube.com/HombaleNinnindale?sub_confirmation=1
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!