Big Boss: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షోకి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. సెప్టెంబర్ మాసం ప్రారంభం లో షో ప్రారంభించడానికి షో నిర్వాహకులు రెడీ అవుతున్నారు. బిగ్ బాస్ షో ప్రతి సీజన్ కి ఆదరణ పెరుగుతూ ఉండటంతోపాటు టిఆర్పి రేటింగులు కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న నేపథ్యంలో ఈసారి సీజన్ ఫైవ్ అదరగొట్టే రీతిలో ఉండే విధంగా షో నిర్వాహకులు ప్లాన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున స్టార్ యాంకర్ లను సోషల్ మీడియాలో సెలబ్రిటీలను సింగర్ లను తీసుకోవడానికి రెడీ అవ్వడం జరిగింది.
ఇటువంటి తరుణంలో.. తాజాగా హౌస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్ ల ఫైనల్ లిస్ట్ రెడీ అయినట్లు ఓ ప్రముఖ మీడియా ఛానల్ లో పేర్లు బయటకు వచ్చాయి. ఆ వివరాలు చూస్తే.. ఈసారి బిగ్ బాస్ హౌస్ సీజన్ ఫైవ్ లో యాంకర్ రవి, యాంకర్ శివ, యాంకర్ వర్షిని, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, సింగర్ మంగలి, యాక్టర్ సురేఖ వాణి, శేఖర్ మాస్టర్, బుల్లితెర నటి నవ్య స్వామి, హీరోయిన్ ఇషా చావ్లా, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, లోబో, యాంకర్ ప్రత్యూష, సిద్ధార్థ వర్మ, విష్ణు ప్రియ వీళ్లంతా రెడీ అయినట్లు ఫైనలిస్టు అన్నట్లు సదరు మీడియా చానల్ తెలిపింది.
Read More: Big Boss: నలుగురు ప్రాణాలను కాపాడిన బిగ్ బాస్ స్టార్ కంటెస్టెంట్..!!
దాదాపు 100 రోజులపాటు ఈ షో కొనసాగించాలి అనే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ఎక్కువగా బుల్లితెరపై ఆధారపడుతూ ఉండటంతో.. షో చాలా రసవత్తరంగా ఉండే రీతిలో ఎటువంటి లీక్ బెడద ఈసారి లేకుండా షో నిర్వాహకులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు సమాచారం.