న్యూస్ సినిమా

Rana : రానా – వెంకటేశ్ కాంబినేషన్‌లో వెబ్ సిరీస్

Share

Rana : దగ్గుబాటి వారసులు రానా – విక్టరీ వెంకటేశ్ కలిసి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలో వీరిద్దరు కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు వెంకీ వెల్లడించారు. ఇద్దరు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాలలో నటిస్తున్నారు. బాహుబలి సినిమాలో ప్రభాస్ తో కలిసి రానా నటించాడు. మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 చిత్రాలు వెంకటేశ్ చేశాడు. ఇప్పుడు ఎఫ్ 3లో నటిస్తున్నాడు. ఇలా దగ్గుబాటి హీరోలు
ఎప్పుడు వేరే హీరోలతో మల్టీస్టారర్ చేయడానికి సిద్దంగా ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే ఫేం లో కనిపించబోతున్నారట.

web series in rana-venkatesh combination
web series in rana-venkatesh combination

రానా గతంలో నటించిన కృష్ణం వందే జగద్గురం సినిమాలో వెంకీ ఓ సాంగ్ లో గెస్ట్ గా కనిపించి అలరించారు. ఈసారి ఇద్దరు కలిసి సొంత ఓటీటీ కోసం వెబ్ సిరీస్ లో నటించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే కింగ్ నాగార్జున ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు కథ విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా స్వయంగా ప్రకటించాడు. ఈ వెబ్ సిరీస్ మొదలు అయ్యేది ఎప్పుడనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. దాంతో అక్కినేని అభిమానులు ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ సహా కోలీవుడ్ స్టార్స్ అండ్ హీరోయిన్స్ ఇప్పటికే వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్నారు.

Rana : రానా – వెంకీ కూడా ఇదే రూట్ లో అడుగుపెడుతున్నారు.

ఈ నేపథ్యంలో వెంకీ – రానా కూడా ఇదే రూట్ లో అడుగుపెడుతున్నారు. అయితే సొంత ఓటీటీ కంటే ముందే ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ చేసేందుకు ఒప్పుకున్నట్టు తాజాగా వెంకటేష్ వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలతో పాటు ఆ వెబ్ సిరీస్ ను కూడా పూర్తి చేయనున్నాడట. ఇక ఓటీటీ కంటెంట్ విషయంలో హీరోలు కొందరు చులకనగా చూస్తున్న సమయంలో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ మంచి సబ్జెక్ట్ తెస్తే తప్పకుండా నటిస్తానని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఇక ఆయన నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.


Share

Related posts

Pooja Hegde: పవన్ అయితే ఏంటి.. వెయిట్ చేసే ప్రసక్తే లేదు.. పూజా హెగ్డే సంచలన కామెంట్స్..?

Ram

Rashmika Mandanna: అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా.. ర‌ష్మిక ఓపెన్ కామెంట్స్‌!

kavya N

బిగ్ బాస్ 4 : మోనాల్ దృష్టిలో A అంటే అవినాష్ అట..! ముద్దు కూడా పెట్టేసింది…

arun kanna