Big Breaking: మహారాష్ట్రలో శివసేన నేత, మంత్రి ఏక్ నాథ్ శిందే తన వర్గంలో తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో శివసేన – ఎన్ సీపీ – కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన మహా వికాశ్ అఘాడీ సర్కార్ మైనార్టీ పడిపోయింది. మహారాష్ట్రలో రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మంత్రి ఏక్ నాథ్ వైపు వెళుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. నలుగురు స్వతంత్రులతో కలిపి 34 మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ వైపు నిలవగా తాజాగా మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు చార్టర్ ఫ్లైట్ లో గువాహటికి చేరుకున్నట్లు సమాచారం. మరో పక్క సీఎం ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్ష పదవి నుండి తప్పుకోవడానికి సిద్ధంగాా ఉన్నానంటూ ఫేస్ బుక్ లైవ్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయడం లేదని పేర్కొన్న ఉద్దవ్ .. శివసేన ఎమ్మెల్యేలలో ఒక్కరు వద్దన్నా రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్దవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆ తరువాత ఉద్దవ్ ఠాక్రే సీఎం అధికార నివాసాన్ని వీడి మాతోశ్రీకి కుటుంబంతో సహా వెళ్లిపోయారు. మరో పక్క ఉద్దవ్ ఫేస్ బుక్ లైవ్ లో ప్రసంగించిన అనంతరం తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేత ఏక్ నాథ్ శిందే స్పందించారు. శివసేన మనుగడ కోసం అసహజమైన పొత్తు నుండి బయటపడటం ఎంతో అవసరమని అన్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో కేవలం కాంగ్రెస్, ఎన్ సీపీలే లబ్ది పొందాయనీ, శివసేనికులు మునిగిపోయారని వ్యాఖ్యానించారు. శివసేన శాసనసభా నేత హోదా నుండి పార్టీ ఏక్ నాథ్ ను తప్పించగా రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం ఆయననే తమ శాసనసభ నేతగా పేర్కొంటూ తీర్మానం చేశారు. పార్టీ చీఫ్ విప్ గా సునిల్ ప్రభు స్థానంలో భరత్ గోగవాలేను నియమించుకున్నారు. ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేలు 34 మంది తీర్మానం ఆమోదించి గవర్నర్, డిప్యూటి స్పీకర్ కు లేఖ రాశారు. కాగా సీఎం అధికార నివాసం నుండి ఉద్దవ్ వీడి వెళుతున్న సమయంలో పెద్ద సంఖ్యలో శివసేన కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. కార్యకర్తలకు కారు నుండే అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.
Acharya: కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. రామ్ చరణ్(Ram Charan) ఫస్ట్ టైం లాంగ్ లెన్త్ రోల్…
Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…