ఇటీవల ఆర్థరైటిస్ పెయిన్ కారణంగా హౌస్ నుండి బయటకు వచ్చేసిన నోయల్ బిగ్ బాస్ అనుభవాలు గురించి సోషల్ మీడియాలో నెటిజన్ల తో పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా హౌస్ లో ఉన్నంత కాలం ఇంటి సభ్యులను మిస్ అయినట్లు తెలిపాడు. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు బాగా కనెక్ట్ అయినట్లు వాళ్లని ఎంతో మిస్ అవుతున్నట్లు నోయల్ పేర్కొన్నాడు.
హౌస్ లో ఉన్నంత కాలం మొదటి నుండి నొప్పి ఉన్నాగాని భరించి గేమ్ ఆడటం జరిగిందని, కాని చివరిలో తట్టుకోలేక బయటికి వచ్చేసినట్లు క్లారిటీ ఇచ్చాడు. కాగా హౌస్ లో ఉన్నంతకాలం తనని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నోయల్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఓటింగ్ కి చివరి రోజు కనుక తన ఫ్రెండ్స్ అయినా అభిజిత్ అదేవిధంగా హారికా కి ఓట్లు వెయ్యాలని కోరాడు.
ఇదిలా ఉండగా తన సపోర్ట్ మాత్రం వాళ్ళిద్దరికీ ఉంటుందని కాబట్టి వాళ్ళిద్దరినీ గెలిపించాలని నోయల్ ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో వీడియో చిట్ చాట్ చేసిన సమయంలో కోరడం జరిగింది. మళ్లీ బిగ్ బాస్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఛాన్స్ ఇస్తే మాత్రం ఈసారి బాగా ఆడతానని ఆడియన్స్ కి మాట ఇచ్చాడు. ఎప్పుడూ బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి వెయిట్ చేస్తున్నానని నోయల్ తెలిపాడు. మొత్తంమీద నోయల్ తాను బయట ఉన్నా గాని ఇంటిలో తన ఫ్రెండ్స్ అయినా అభిజిత్, హారిక గెలుపు కోసం బాగానే కష్టపడుతున్నారని ఈ వీడియో చూసి నార్మల్ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.