బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. టిఆర్పి రేటింగ్ లలో కూడా గత సీజన్లకు మించి ఎక్కువ సాధిస్తున్నట్లు నాగార్జున పలు సందర్భాలలో వీకెండ్ ఎపిసోడ్ లలో తెలియజేయటం మనందరం చూశాం. లాక్డౌన్ నేపద్యంలో బయట సినిమాలు లేకపోవడంతో చాలావరకు ఎంటర్టైన్ ప్రేక్షకులు టెలివిజన్ పై పడటంతో ఈ సీజన్ కి బాగా ఆదరణ వచ్చినట్లు బయట టాక్. ఇదిలా ఉంటే హౌస్ లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్ గా ముందు నుంచి ట్రాక్ లో ఉన్న వాడు అభిజిత్.
చాలా నామినేషన్ల లో అభిజిత్ ఉండటం తో హౌస్ లో అతను ఆడుతున్న గేమ్ కి, అతని మైండ్ కి బాగా సెట్ అవటం తో పాటు ఇంటి సభ్యులతో ఏదైనా విషయం గురించి మాట్లాడాల్సిన సందర్భం వస్తే పాయింట్ టు పాయింట్ తన వివరణ ఇవ్వటం చాలా సందర్భాలలో హైలెట్ అవ్వడం జరిగింది. దీంతో ఈ సీజన్లో చాలా వరకు ఓటింగ్ విషయంలో అభిజిత్ కి రికార్డు స్థాయిలో ఓట్లు పడ్డాయి.
ఇదిలా ఉంటే 12వ వారం లో మాత్రం ఎవరు ఊహించని విధంగా మోనాల్ కి ఓటింగ్ శాతం ఒక్కసారిగా పెరగటంతో బయట అందరి అంచనాలు లెక్కలు తలకిందుల అవుతున్నాయి. 12వ వారం ఇంటి నుండి ఎలిమినేషన్ కి నామినేట్ కావటంతో 12వ వారం ఇంటి సభ్యులు ఓటింగ్ విషయంలో మోనాల్ ఊహించని విధంగా.. గతంలో అభిజిత్ కంటే ఎక్కువ ఓట్లు రాబడుతుంది అనే టాక్ బయట గట్టిగా వస్తుంది. హారిక కెప్టెన్సీని చేసే విషయంలో అదేవిధంగా సోమ వారం ఎలిమినేషన్ నామినేషన్ సమయంలో మోనాల్ మాట్లాడిన పాయింట్లు ఆమెపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలు ఒక్కసారిగా తలకిందులు చేసినట్లు.. కచ్చితంగా మోనాల్ కూడా టాప్ ఫైవ్ లో కి వెళ్ళటం గ్యారెంటీ అని బయట జనాలు చెప్పుకుంటున్నారు.