బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫేవరెట్ కంటెస్టెంట్ లో ఒకడైన అభిజిత్ ఈ మధ్య కొంచెం తగ్గినట్లు కనిపించాడు. ఈ క్రమంలో చాలా గొడవలు జరుగుతున్నప్పటినుండి అభిజిత్ కొంచెం సైలెంట్ అయ్యాడు. ఇక తాజాగా ఛాన్స్ వచ్చినప్పుడు తన మనసులోని మాటలను బయట జనాలు అనుకుంటున్న మాటను చెప్పాడు.
అభిజిత్ కు మోనాల్, అఖిల్ నచ్చలేదు అని తెలిసిందే. ఇక అఖిల్ తో కూడా తనకు పెద్దగా ప్రాబ్లం ఏమీ లేవని చెప్పిన అభిజిత్ మోనాల్ మీద కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ గురించి చెప్పాడు. మొదట్లో నాకు బాగా హైపర్ అనిపించింది. కానీ తర్వాత బాగా రిలేషన్ కుదిరింది అని అన్నాడు కానీ చివరికి నేను ఆమె రెండు భిన్న మనస్తత్వాలు కలిగిన వారిని అని నాకు అర్థం అయింది అని చెప్పాడు. అందుకే ఆ ఇద్దరికీ సెట్ కాదని తెలిసింది అంటూ వివరించాడు.
అఖిల్ ను మొదట చూసినప్పుడు చాలా మంచివాడు, కూల్ గాయ్ అనుకున్నాను ఇక ఇప్పటికి కూడా అంతే.. మోనాల్ చాప్టర్ తీసేస్తే అతను నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యేవాడు ఒక టాపిక్ కారణంగానే అతను దూరమయ్యాడు అని చెప్పాడు. అలాగే బయట జనాలు కూడా అభిజిత్ మాట్లాడిన మాటలు చెబుతున్నారు. మోనాల్ వల్లే అభి, అఖిల్ ఇద్దరు శత్రువులు లేకపోతే మంచి మిత్రులు అయ్యేవారు అని చెప్పారు. ప్రస్తుతానికి 14వ వారం మోనాల్ ఎలిమినేట్ అయినట్లు టాక్ బయటకు వచ్చింది. మిగిలిన ఐదుగురు గ్రాండ్ ఫినాలే లోకి ఎంటర్ అయ్యారని తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!