గత రెండు వారాల నుండి బిగ్బాస్ సీజన్ రేటింగ్ కొద్దికొద్దిగా భారీగా పెరుగుతోంది. ఇక ఇందుకు ప్రధాన కారణం నామినేషన్స్ అనే చెప్పాలి. టాస్క్ లలో వివాదాలతో పెరగడంతో ప్రతి సోమవారం అసలు రంగు బయట పడేలా చేస్తున్నాయి. గతవారం నామినేషన్స్ అయితే భారీ హిట్. ఇక అమ్మ రాజశేఖర్ ను అంతా టార్గెట్ చేశారు. చివరికి అతనిని ఇంటి నుండి బయటకు పంపించేశారు.
ఈసారి అదే వరుసలో అరియానా ను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా రాజశేఖర్ కు అరియానా గతవారం పూర్తిగా మద్దతు ఇచ్చింది. నామినేషన్లు మొదలు కాగా ఈసారి ఆ ప్రక్రియను బిగ్బాస్ డిఫరెంట్ గా ట్రై చేశాడు. ఏకంగా బాటిల్స్ తో కంటెస్టెంట్ తల పైన కొట్టి నామినేట్ చేయాలని చెప్పడంతో వారి మధ్య కోపాలు మరింత ఎక్కువవుతాయి అన్నది అతని ప్లాన్.
చూడబోతే అందరికీ ఒక్కరే టార్గెట్ అని అర్థమవుతుంది. అరియానా హారిక అదే గొడవ పడగా…. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు అని కౌంటర్ ఇవ్వగా…. అరియానా కూడా అదే రేంజ్ లో ఇచ్చింది. ఇక సోహెల్ నా ఆటిట్యూడ్ ఇంతే కదా…. వేరేలా కథ ఉంటది అని ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఆఖరికి ప్రశాంతంగా కనిపించే మోనాల్ కూడా అరియానా పై కోపం చూపి…. నామీద కామెంట్ చేశారు నొప్పి ఏమిటో మీకు తెలుసు అంటూ గట్టిగా అరిచింది.
ఇక కొంతమంది టార్గెట్ చేసినా అరియానా ఏ మాత్రం తగ్గదు అని అర్థం అయింది. ముఖ్యంగా మెహబూబ్. హారిక, లాస్య, సోహెల్ ఆమె తలపై బాటిల్ తో కొట్టడం తో ఈ సారి ఆమె ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటుంది అని అర్థమైంది.