బిగ్‌బాస్ ఇంటిలో ఎమోషన్స్ ఎక్కువ. ఒక్కసారి సందర్భాన్నిబట్టి చెప్పే మాటల్లోని అర్థాలు మారుతుంటాయి. ఇక అన్న వారికి వినే వారికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి కూడా అవి మారుతూ ఉంటాయి. నిన్నటి ఎపిసోడ్ లో హారిక, సోహెల్ మధ్య కూడా అలాగే జరిగింది. ఒక్కసారిగా హారిక అన్న మాటలకు సోహెల్ విపరీతంగా బాధ పడ్డాడు. నాగార్జున ఆదించిన ఆట లో బాగా సరదాగా పాల్గొన్న సోహెల్ అందరికీ అతనిపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకున్నాడు.
కానీ హారిక అన్న మాటలకు మాత్రం అతను బాగా నొచ్చుకున్నాడు. దీపావళి అంటే టపాకాయలు తప్పక ఉండాల్సిందే కాబట్టి ఇంటిలో చిచ్చుబుడ్డి, రెండు టపాకాయలు తెచ్చి ప్రతి ఒక్కరిని పిలిచి ఇందులో ఎవరు చిచ్చు బుడ్ది అవుయారు, ఎవరు ఆటంబాంబ్ అవుతారు అని నాగార్జున ప్రశ్నించాడు. చిచ్చుబుడ్డి అంటే చాలా హోప్ ఇస్తుందని కానీ చివరికి తుస్ ఉంటుంది అని…. ఆటంబాంబు అంటే అసలైన సమయంలో సరిగ్గా పేలుతుంది అని అడిగాడు.
దాదాపు చాలామంది అభిజిత్ కు ఆటంబాంబు ఇచ్చారు. ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పలేం, ఒకసారి పేలితే అదే రేంజ్ లో ఉంటుంది టైం కోసం చూసి వచ్చిన తర్వాత పేలుతాడు అని చెప్పారు. ఇక అత్యధిక మంది సోహెల్ కి చిచ్చు బుడ్డి ఇచ్చారు. దానిని స్పోర్టివ్‌గా తీసుకున్నాడు అందరూ ఇతను కోపంగా ఉంటాడు కానీ చివరికి తర్వాత తగ్గిపోతుంది అని చెప్పారు. అయితే ఈ విషయంపై హారిక కొంచెం ఎక్కువ మాట్లాడింది.
ఇంట్లో అందరినీ గొడవ కి రమ్మని పిలుస్తారు కానీ అందరి మీదకి వస్తాడు కానీ ఎవరు అతను పట్టించుకోరు ఏం చేసినా సోహెల్ ను ఎవరు దేకరు అని అనింది. ఇక సోహెల్ వేస్ట్ అన్న పదం వాడింది. దీనికి సోహెల్ బాగా ఫీలయ్యాడు. మెహబూబ్ కి చెప్పుకొని నేను ఎవరినైనా ఎప్పుడైనా వేస్ట్ నువ్వు వేస్ట్ గాడివి అలాంటి పదాలు వాడేనా…. తనుఅంటే ఎలా ఉంటుంది అని ఫీల్ అయ్యాడు