ఈ సారి బిగ్ బాస్ షో లో ప్రేక్షకులకు నిర్వాహకులు కొంతవరకు కష్టం తగ్గించారు. మొదటినుండి ఏ ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్లు అయితే స్ట్రాంగ్ అనుకుంటున్నారో వారే టాప్ ఫైవ్ కి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకోవడం ఇందుకు కారణం. వివరాల్లోకి వెళితే ఇంటి లోకి అడుగు పెట్టిన రెండు వారాలకే అభిజిత్ చాలా స్ట్రాంగ్ అని అర్థం అయిపోయింది. ఇక అతనితో పాటు అరియానా, సోహెల్, అఖిల్, హారిక కూడా చివరి వరకు ఉంటారని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే వీరు అందరూ ఉన్నారు.
అయితే ఒక ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్ లు మాత్రం అర్హత ప్రకారం ఉండాల్సిన రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉన్నారని చాలా విమర్శలు వచ్చాయి. కానీ టాప్- 5 కి ఎవరు వెళ్తారు అన్నది పూర్తిగా స్పష్టం అయినట్లే అని అనుకుంటున్నారు. నిన్న ఇంటి సభ్యుల బంధువులు కూడా అనుకున్న పేర్లనే టాప్ ఫైవ్ లో ఉంచారు. అయితే ఈ ఐదుగురిలో కేవలం ఇద్దరే గ్రాండ్ ఫైనల్స్ లో ముఖ్యఅతిథి పక్కన ఉంటారు. ఆ ఇద్దరు ఎవరు అన్న విషయంపై ఇప్పుడు భారీ చర్చ జరుగుతుంది.
వారిద్దరిలో ఒకరు అభిజిత్ అన్నది కచ్చితం అని అందరూ అంటున్నారు. అభి పక్కనే ఉంది అతనికి పోటి ఇచ్చి అనూహ్యంగా టైటిల్ గెలిచే సత్తా ఎవరికైనా ఉందా అన్నది ప్రశ్న. ఇక ఈ విషయానికి వస్తే ఇందుకు చాలామంది సోహెల్ పేరు చెబుతున్నారు. మొదట్లో తన దుందుడుకు వ్యవహారంతో సోహెల్ డేంజర్ జోన్ లో పడిన తర్వాత క్రమంగా పుంజుకున్నాడు.
అయితే అతనికి అఖిల్ నుండి పోటీ ఉండొచ్చు కాని ఇద్దరిలో మాత్రం సోహెల్ కే ఎక్కువ ఓట్లు వేస్తారు అన్నది కొందరి అంచనా. అయితే అనూహ్యంగా అరియానా పేరు కూడా తెరమీదకు వచ్చింది. లేడీ కంటెస్టెంట్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు కాబట్టి దాదాపు చాలా మంది అమ్మాయిలు బోల్డ్ అరియానా ను ఫైనల్స్లో చూడాలని ఇంక మరి కొందరైతే టైటిల్ కూడా గెలిపించాలని అనుకుంటున్నారట. చూద్దాం మొత్తానికి వీరు ముగ్గురు లోనే టాప్ – 2 ఉండాలని అంటున్నారు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!