తెలుగు బుల్లితెర యాంకర్ వర్షిణి బిగ్ బాస్ షో కు తన పెద్ద ఫ్యాన్ అని చెప్పింది. తాజాగా దీపావళి సందర్భంగా యాంకర్ రవి వర్షిణి ని ఇంటర్వ్యూ చేశాడు. వర్షిణి తో పాటు ఆమె అక్క సౌజన్య కూడా మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆ ముగ్గురూ కలిసి బిగ్బాస్ సీజన్ గురించి ముచ్చటించారు.
వర్షిణికి, ఆమె సోదరి సౌజన్యకు అభిజిత్ ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పడం విశేషం. ఇక వర్షిణి, అభిజిత్ పెళ్లిచూపులు అనే ఒక సూపర్ హిట్ వెబ్ సిరీస్ చేశారు. మూడు సీజన్ల ఈ సిరీస్ చాలా పెద్ద సక్సెస్ అయింది. అలా ఏర్పడిన స్నేహం లో అభిజిత్ గురించి వర్షిణి తెలుసుకుందట. షో కి వెళ్లేముందు కూడా వర్షిణి కి అభి ఫోన్ చేశాడు అని చెప్పుకొచ్చింది. ఇలా షో కి రమ్మని అంటున్నారు వెళ్లాలా వద్దా అని అడిగాడు అని చెప్పిందట.
టీవీ ఇండస్ట్రీ గురించి నీకు తెలుసు కదా ఎలా ఉంటుంది? ఏ నిర్ణయం తీసుకో మంటావ్ అని కొన్ని సలహాలు సూచనలు అడిగాడని చెప్పింది. నువ్వు చాలా స్మార్ట్ గా ఆలోచిస్తావు వెళితే బాగుంటుంది అని వర్షిణి చెప్పినట్లు తెలిపింది. ఈ సీజన్లో అభి తో పాటు అరియానా కూడా తనకు బాగా ఇష్టమని వర్షిణి చెప్పుకొచ్చింది. నాకు కూడా ఇద్దరు ఇష్టమని వర్షిణి సోదరి చెప్పడం గమనార్హం.
వారిద్దరూ ఫైనలిస్టులు గా ఉండాలని కానీ అభి తన ఫ్రెండ్ కాబట్టి అతని గెలవాలని వర్షిణి చెప్పింది. కానీ వర్షిణి సోదరి మాత్రం అరియానా విన్నర్ కావాలని అనుకుంటున్నట్లు చెప్పింది. ఇంతవరకు లేడీ కంటెస్టెంట్ టైటిల్ గెలవలేదు ఆమె గెలిస్తే బాగుంటుంది అని చెప్పడం విశేషం. ఇక బయట ఎలా ఉంటుందో తెలియదు…. కానీ వర్షిణి మాత్రం తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా బయటకి చెప్పేసింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!