ప్రస్తుతం నెట్టింట్లో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది అభిజిత్-అఖిల్ గొడవే. అఖిల్ సీక్రెట్ రూమ్ నుండి ఇంటి లోపలికి వచ్చాడు. సీక్రెట్ రూమ్ లో ఉన్నన్ని రోజులు అభిజిత్ మాట్లాడిన మాటలను విన్నాడు. అభిజిత్…. అఖిల్ అంతా త్వరగా బయటకు వెళ్లేందుకు ఎలా ఒప్పుకున్నాడు? అతనికి గేమ్ పైన సీరియస్నెస్ లేదా లేకపోతే కెప్టెన్సీ కోసం మెహబూబ్ తో అంత గొడవ పడిన వ్యక్తి అంత ఈజీగా బయటకి ఎందుకు వెళ్ళాడు? అని మిగిలిన వారితో చర్చించాడు.
ఇక అనూహ్య పరిస్థితుల లోపలికి వచ్చిన అఖిల్ నామినేషన్ ప్రక్రియలో అభి పై దాడి చేయడం మొదలు పెట్టాడు. దానికి అభిజిత్ ఇలా సమాధానం ఇచ్చాడు…. నేను కెమెరా లో ముందు మాట్లాడిన వాడిని నీతో మాట్లాడేందుకు నాకేమీ భయం లేదు అని అన్నాడు. ఆ తర్వాత అఖిల్ “నేను మేక లాగా బయటకు వెళ్లాను అని అనుకుంటున్నావు…. కానీ ఎక్స్ట్రా ప్రోటీన్ తిని వచ్చి పులిలా గా లోపలికి వచ్చాను” అని అన్నాడు. దానికి అభిజిత్ మేక ఎప్పటికీ పులి కాదు…. మేక బలి అవుతది అని కౌంటర్ వేశాడు.
ఇక వీరిద్దరి రగడ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచి పెట్టింది. ఎవరూ ఏ ఒక్క సందర్భంలో తగ్గకుండా పోటాపోటీగా వాదించుకున్నారు. అయితే ఎక్కువ మంది నెటిజన్లు అభిజిత్ కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అఖిల్ కు వ్యతిరేకంగా మీమ్స్, ట్రోల్స్, వీడియోలు చేస్తూ అభిజిత్ కి బాగా సపోర్ట్ చేశారు. ఈ దెబ్బతో అఖిల్ ఇంటినుండి బయటికి వెళ్ళిపోతాడు అని అనుకున్నారు కానీ బిగ్బాస్ అతనికి కెప్టెన్సీ కట్టబెట్టాడు.
దీంతో ఈ వారం అఖిల్ నామినేషన్ లో లేడు. అయితే అభిజిత్ ను అఖిల్ ఫ్యాన్స్ వ్యతిరేకించడం కూడా కొంతవరకు చూడవచ్చు. కానీ అఖిల్ మాత్రం అభిజిత్ ని కావాలని నిందించాడని…. కావాలనే అభి ని టార్గెట్ చేస్తున్నాడు అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ షో కాస్త అఖిల్ ఫ్యాన్స్ వర్సెస్ అభి ఫ్యాన్స్ అన్నట్లు అయిపోయింది. మరి వీరిద్దరు కంటెస్టెంట్ లో ఫైనల్స్ లో ఇద్దరూ నిలుస్తారా లేకపోతే వీరిద్దరి మధ్యే టైటిల్ ఉంటుందా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.