తిరువనంతపురం, జనవరి 5: కేరళలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడంపై హింధూ సంస్థలు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. నాటు బాంబుల మోతలు, రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం కన్నూరు ప్రాంతంలో బీజెపీ, సీపీఎం నాయకుల ఇళ్లపై బాంబు దాడులు జరిగాయి.