NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బొత్స అటు.. గంటా ఇటు… ఇద్ద‌రూ రివ‌ర్స్ జంప్ చేస్తున్నారుగా…!

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో కాక‌లు తీరిన ఇద్ద‌రు రాజ‌కీయ యోధులు మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ రాజ‌కీయం సాధార‌ణ ఎన్నిక‌ల వేళ ఆస‌క్తిగా మారింది. ఇక మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావును నిలబెట్టాలని చంద్రబాబు అనుకున్న విషయం తెలిసిందే. చంద్ర‌బాబు పిలిచి ఇప్ప‌టికే దీనిపై ఆలోచ‌న చేసుకోవాల‌ని గంటాకు సూచ‌న చేశారు. అయితే ప్ర‌తి ఎన్నిక‌కు నియోజ‌క‌వ‌ర్గం మారే అల‌వాటు ఉన్న గంటా .. తనకు భీమిలీ టిక్కెట్ కావాలని కోరుతున్నారు.

అయితే ఇప్పుడు సీన్ అనూహ్యంగా రివ‌ర్స్ అయ్యింది. బొత్స చీపురుప‌ల్లి వ‌దిలి మ‌రో సీటు నుంచి పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్టు టాక్ ? బొత్స‌ భీమిలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని జ‌గ‌న్ ఖ‌రారు చేశారు. తాను చీపురుప‌ల్లిలో, భార్య ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేస్తే ఇద్ద‌రూ వేర్వేరు చోట్ల పోటీలో ఉంటారు. చీపురుప‌ల్లి విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటులో ఉంది. అదే బొత్స భీమిలి నుంచి పోటీ చేస్తే అప్పుడు విశాఖ పార్ల‌మెంటు ప‌రిధిలోనే భీమిలి ఉన్న‌ట్టు ఉంటుంది.

పైగా బొత్స ఫ్యామిలీ విశాఖ‌లోనే నివాసం ఉంటోంది. జ‌గ‌న్ భీమిలి సీటుపై తేల్చ‌క‌పోవ‌డంతోనే ఝాన్సీ కూడా విశాఖ‌లో పోటీ చేయాలా ? వ‌ద్దా ? అనే అంశంపై ఇంకా తేల్చుకోలేదంటున్నారు. ఒక‌వేళ జ‌గ‌న్ బొత్స‌కు భీమిలి సీటు ఇవ్వ‌ని ప‌క్షంలో ఝాన్సీ విశాఖ బ‌రిలో ఉండే అవ‌కాశం లేద‌నే అంటున్నారు. అందుకే బొత్స భీమిలి నుంచి పోటీ చేసే అవ‌కాశాలే ఎక్కువుగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అదే జ‌రిగితే అప్పుడు గంటా చీపురుప‌ల్లి వెళ‌తారా లేదా తాను కోరుకున్న‌ట్టుగానే మంత్రి బొత్స వైసీపీ నుంచి భీమిలిలో పోటీ చేస్తే గంటా కూడా భీమిలిలోనే బొత్స మీద పోటీకి దిగుతారా ? అన్న‌ది కాస్త స‌స్పెన్స్‌గానే ఉంటుంది. బొత్స భీమిలి నుంచి బ‌రిలోకి దిగితే పోటీగా టీడీపీ తరపున గంటానే బరిలోకి దిగ‌డం ప‌క్కా.. అప్పుడు ఆయన కోరుకున్న టిక్కెట్ వస్తుంది. చంద్రబాబు అనుకున్న‌ది కూడా జ‌రుగుతుంది.

అప్పుడు చీపురుప‌ల్లిలో టీడీపీ నుంచి ఎప్ప‌టి నుంచో పని చేసుకుంటున్న కిమిడీ నాగార్జునకే అవకాశం లభిస్తుంది. అయితే గంటా పోటీ చేసే పరిస్థితి ఉంటే.. బొత్స ఆలోచించే అవకాశాలు ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఏదేమైనా ఏపీలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు టీడీపీ, వైసీపీ క్యాండెట్లు ఫిక్స్ అయ్యే వ‌ర‌కు ఈ టెన్ష‌న్ త‌ప్పేలా లేదు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju