కారు 40 లక్షలు, నంబర్ 34 లక్షలు..! లక్కీ నంబర్ కోసం భారీగా ఖర్చు చేసిన ఘనుడు..!!

 

మనకు నచ్చినా బైక్, కార్ కొన్నపుడు మన అదృష్ట సంఖ్య కూడా మన నంబర్ ప్లేట్ పై వస్తే ఆ కిక్కే వేరు..! అయితే విఐపి నంబర్ కోసం జనం లక్షలు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు.. ఇపుడు “007” నంబర్ కోసం బిడ్డింగ్ లో ఏకంగా రూ. 34 లక్షలు పెట్టి కైవసం చేసుకున్నారు.. మిగతా వివరాలు ఇలా ..

 

 

తమకు నమ్మకం, అదృష్టాన్నీ కలిగించే నెంబర్ కోసం బిడ్డింగ్ ను నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పోర్టల్‌లో 25,000 రూపాయలతో మొదలు పెట్టి ఎవరైతే వేలంపాటలో నెగ్గుతారో వారికి మాత్రమే సొంతమవుతుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఆసిక్ పటేల్ అనే వ్యాపారవేత్త ఇటీవల కొత్త టయోటా ఫార్చ్యూనర్‌ను కొనుగోలు చేశాడు. అతను టాప్-ఎండ్ 4WD వేరియంట్‌ను కొనుగోలు చేయగా సుమారు రూ .40 లక్షలు ఖర్చయింది. అయితే తన మొదటి టయోటా ఫార్చ్యూనర్ కారు సంఖ్య “007” నంబర్ కోరాడు. ఇది చాలా ప్రజాదరణ పొందిన సంఖ్య కాబట్టి, ఈ సంఖ్య కోసం బిడ్డింగ్ జరింగింది. ఒక రోజంతా బిడ్డింగ్ జరగ్గా రూ. 25 లక్షలున్నా వేలంపాటను చివరి ఏడు నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఆసిక్ రూ.34 లక్షలకు సొంతం చేసుకున్నాడు.. అయితే ఈ డబ్బును ఆర్ డి ఓ కు చెల్లించాలి.

 

ఆసిక్ పటేల్ మాట్లాడుతూ , ఈ సంఖ్య నాకు అదృష్టం, నమ్మకం. అందుకే తన టయోటా ఫార్చ్యూనర్ కోసం GJ01WA007 కోసం అంత ఖర్చు చేసినట్లు తెలిపారు. మనం ఒకసారి కారు ధర, విఐపి నెంబరు మధ్య గల వ్యత్యాసం కేవలం 5 లక్షలు మాత్రమే. వీఐపీ నంబర్ కోసం ఇంత భారీ మొత్తంలో పెట్టిన ప్రజలు చాలా మంది ఉన్నారు. లాక్డౌన్ మధ్య, “001” నంబర్ కోసం అత్యధిక బిడ్ కేవలం రూ .5.65 లక్షలు. గతంలో, ఈ మొత్తాన్ని ఒక కోటి పెట్టి కొనుగోలు చేశారు.టయోటా ఫార్చ్యూనర్ ఇప్పటికీ భారతీయులలో బాగా ప్రాచుర్యం పొందిన ఎంపిక, ఎందుకంటే దాని అత్యంత విశ్వసనీయమైన ఇంజిన్. బిఎస్ 6 ఉద్గారాలు, చిన్న 2.4 లీటర్ టర్బో-డీజిల్ యూనిట్. 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ , 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్లతో కొనసాగుతోంది. 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ , పెట్రోల్ ఇంజిన్ 5-MT మరియు 6-MT తో డీజిల్ తో అందించబడుతుంది.