బిగ్ బాస్ 4 : అవినాష్ కి మద్దతు పలుకుతున్న సీనియర్ హీరో..! “అతను నా కుటుంబ సభ్యుడు లాగా”

బుల్లితెరపై దాదాపు 8 ఏళ్ళ నుండి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన జబర్దస్త్ ద్వారా ఎంత మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. సినిమాల్లో కూడా తమ సత్తా చాటారు. ఇక వారిలో ముక్కు అవినాష్ ఒకడు. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించిన అతను అదే ఊపులో బిగ్బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఫైనల్ కు వెళ్లే రేసులో నిలిచాడు.

 

ఇలాంటి సమయంలో అవినాష్ పైన ప్రేక్షకుల్లో కొద్దికొద్దిగా విమర్శలు వస్తున్న సమయంలో ఒక సీనియర్ హీరో అతనికి మద్దతు తెలిపాడు. ఆ వివరాల్లోకి వెళితే…. నాలుగో సీజన్ దగ్గర పడుతున్న సమయంలో అవినాష్ ప్రతి విషయంలో అతిగా స్పందిస్తూ చెడ్డపేరు మూటగట్టుకున్నాడు. పైగా గత వీకెండ్ లో ఎలిమినేట్ కూడా అయ్యాడు కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా బతికిపోయాడు. అప్పటినుండి అతనిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

ఇలాంటి సమయంలో అందరూ అభిజిత్ గెలుస్తాడు అని అభిప్రాయపడుతున్నారు. అతని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ లు చేస్తున్నారు. ఆఖరికి అవినాష్ సన్నిహితుడైన మెగాబ్రదర్ నాగబాబు కూడా అభి నే సపోర్ట్ చేస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో ఒక సీనియర్ హీరో అవినాష్ కు తన మద్దతు ఇచ్చాడు. డైలాగ్ కింగ్ సాయికుమార్ అవినాష్ కు తన మద్దతు ప్రకటించాడు. అవినాష్ తన కుటుంబ సభ్యులు లాంటి వాడిని అందుకే అందరూ అతనికి ఓటు వేయాలని కోరారు.