NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

చంద్రబాబు పేద్ద యూ టర్న్..! రాజకీయంగా ఇది తప్పదు..!!

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” బ్యూరో)

ఏపిలో ఇప్పట్లో ఎన్నికలు అయితే లేవు. కానీ రాజకీయ వాతావరణం వాడివేడిగానే ఉంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాకతో వైసీపీ ప్రభుత్వానికి కస్తా కూస్తో అనుకూలంగా ఉంటారని అందరూ భావించారు. కానీ ఇటీవల హిందూ ఆలయాలపై జరిగిన దాడుల నేపథ్యంలో వారి మధ్య అంతర్గతంగా ఉన్న స్నేహం దెబ్బతిన్నట్లుగా కనబడుతోంది. అంతర్వేది ఘటన తరువాత వరుసగా నాలుగైన ఘటనలు జరగడం, ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో బిజెపి, హింధూ సంఘాల నేతలపై కేసులు, పెట్టడం, అరెస్టులు చేయడం వివాదం ముదురుతోంది. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం హింధూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందంటూ సోము వీర్రాజుతో సహా పలువురు బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వంపై ఒకటి రెండు సార్లు మినహా గట్టిగా మాట్లాడని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు సైతం నేడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక చర్చిపై ఎవరో రాళ్లు వేశారనీ 41 మంది హిందువులను అరెస్టు చేసిన ప్రభుత్వం హింధూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే అందుకు బాధ్యులైన వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.

file photo

వైసీపీ, బిజెపి మధ్య నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణాన్ని టీడీపి అడ్వంటేజ్ గా తీసుకోవాలని బిజెపి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాబోయే ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెస్ యేతర పక్షాలతో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ ముందుగానే కెసిఆర్ కు జై కొట్టారు. తృతీయ ఫ్రంట్ కు కెసిఆర్ నాయకత్వం వహిస్తే తాము కలిసి నడుస్తామన్నట్లు ప్రకటించారు నారాయణ, తృతీయ ఫ్రంట్ ఆలోచన ఇప్పట్లో ఏమీలేదని కెసిఆర్ అన్నట్లు వార్తలు వచ్చినా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఢిల్లీలో ఎన్ డి ఎ వ్యతిరేక పక్షాల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారని అంటున్నారు.

అయితే గత అనుభవాల దృష్ట్యా టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం తృతీయ ఫ్రంట్ కు దూరంగా ఉండాలనీ, బిజెపితోనే సఖ్యతగా ఉంటేనే బెటర్ అన్నట్లుగా పావులు కదుపుతున్నారని సమాచారం. ఓ పక్క చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి బిజెపి డోర్ లు మూసేశామమని, ఆయన వస్తామన్నా తాము కలవనివ్వమంటూ ఆ పార్టీ నేతలు పేర్కొన్నా చంద్రబాబు మాత్రం బిజెపితో కలిసి ప్రయాణించడానికే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ఆ తరువాత రాష్ట్ర విభజన తరువాత గానీ బిజెపితో తెగతెంపులు చేసుకుని ఎన్నికలలో దిగిన ప్రతి సారి టీడీపీ పరాజయం పాలైంది. బిజెపితో కలిసి పోటీ చేసినప్పుడే అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అధికార వైసీపి రాష్ట్రంలో బిజెపి నేతలతో పడినా పడకపోయినా కేంద్రం స్థాయిలో సన్నిహిత సంబంధాలనే నెరుపుతున్నది. రాజ్యసభలో పలు కీలక బిల్లుల సమయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తూ వస్తున్నది. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటునమ్మ వాయనం అన్నట్లు కేంద్రంలోని బిజెపికి వైసీపీ సహకరిస్తోంది, ఇక్కడి రాష్ట్రంలోని మూడు రాజధానుల అంశంలోనూ కేంద్రం అడ్డుచెప్పకుండా తోడ్పాటు అందిస్తున్నది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజులో పరిస్థితులు ఎలా ఉంటాయనేది రాజకీయ వర్గాల్లో ఆశక్తిని రేపుతున్నది.

author avatar
Special Bureau

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N