NewsOrbit
న్యూస్

ఎవరికి టిక్కెట్ ఇవ్వకూడదో వారికే ఇచ్చాడు చంద్రబాబు! ఇప్పుడు అనుభవిస్తున్నాడు!!

ఎవరి కర్మకు వారే బాధ్యులు అంటారు. ఇందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడేమీ అతీతుడు కాదు.మొన్నటి ఎన్నికల్లో ఎవరికి పడితే వారికి టిక్కెట్టు ఇచేసిన ఫలితాన్ని చంద్రబాబునాయుడు ఇప్పుడు అనుభవిస్తున్నారు.

 Chandrababu gave the ticket to whom they should not be given
Chandrababu gave the ticket to whom they should not be given

ఓడిపోయాక కాడ దించేసిన ఆ నేతలను చూసి ఇపుడు చంద్రబాబు వాపోతున్నారు.మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అంటే ఇరవై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ ముగ్గురి కారణంగా టిడిపి అత్యంత దయనీయ పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది .ఇప్పుడు అక్కడ పార్టీ జెండా కట్టే కార్యకర్త కూడా కనిపించడం లేదంటున్నారు.విశాఖ జిల్లాలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. గత 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

విశాఖ ఎంపీగా గీతం సంస్థల అధినేత శ్రీభరత్ ను, అనకాపల్లి నుంచి ఆడారి ఆనంద్, అరకు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కిశోర్ చంద్రదేవ్ కు టిక్కెట్ లు ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ముగ్గురూ ఓటమి పాలయ్యారు.విశాఖ ఎంపీగా పోటీచేసిన శ్రీభరత్ తన ఓటమికి టీడీపీ నేతలే కారణమని భావిస్తూ ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాను అధిష్టానానికి ఈ విషయాన్ని నివేదికలతో సహా ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని శ్రీ భరత్ అసహనంతో ఉన్నారని సమాచారం. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.

ఖర్చు కూడా పార్టీ కోసం పెట్టడం లేదు. ఇటీవల కొందరు పార్టీ కార్యాలయం, కార్యక్రమాల నిర్వహణ కోసం కొంత మొత్తాన్ని ఇవ్వాలని శ్రీభరత్ వద్దకు వెళ్లగా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది.ఇక అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆడారి ఆనంద్ వైసీపీలో చేరిపోయారు.ఇక అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కిశోర్ చంద్రదేవ్ అసలు పార్టీలోనే లేడనుకోవాలి. ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకే పరిమితమయ్యారు. ఇలా విశాఖ జిల్లా లోని మూడు పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అనేది లేకుండా పోయిందంటున్నారు.

ఇందుకు నింది౦ చాల్సింది చంద్రబాబునాయుడునేనని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.ఎన్నికల సమయంలో క్యాష్ సూట్కేసులతో వచ్చేసిన వారికి చంద్రబాబు టిక్కెట్లిచ్చే పంపారని వారు ఓడిపోయాక పార్టీ ముఖం కూడా చూడ్డం లేదని పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు.చివరకు వియ్యంకుడు బాలయ్య చిన్నల్లుడు భరత్ కూడా పార్టీకి హ్యాండ్ ఇవ్వడంతో చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారట.అయినా మేకపోతు గాంభీర్యంతో అలా ముందుకు వెళదామంటూ చంద్రబాబు నెట్టుకొస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju