ఓటమి లోనూ గెలుపు ! జగన్ కు తన అనుభవం రేంజి చూపుతున్న బాబు !!

Share

దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత కూడా ఇంకా
ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టాల‌నే వ్యూహంతో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మసిపూసి మారేడు కాయ చేసి ప్రజలను మభ్యపెట్టి ఇంకా తెలుగుదేశం పార్టీ ఊపులోనే ఉందని చెప్పుకోవాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు.

దీని మీద ఇప్పుడు సోష‌ల్ మీడియాలో టిడిపిపై విమర్శల వర్షం కురుస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. తాజాగా జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఎస్సీ వ‌ర్గానికి చెందిన వ‌ర్ల రామ‌య్య ఓడిపోయారు.వాస్త‌వానికి రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నెగ్గాలంటే బ‌లం ఉండాలి. కానీ, ఈ బ‌లం టీడీపీకి లేదు. అయినా కూడా చంద్ర‌బాబు వ‌ర్ల రామ‌య్య‌ను వ్యూహాత్మ‌కంగా దింపారు. కానీ, ఇది విక‌టించింది. ఆయ‌న ఓడిపోయారు.అయినా కూడా చంద్ర‌బాబు ఆయ‌న ప‌రివారం మాత్రం నైతికంగా తాము విజ‌యం సాధించామ‌ని డ‌బ్బా కొట్టుకుంటున్నారు.

ఇక‌, పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూర‌మ‌య్యారు. అయితే, వీరిని త‌మ దారిలోకి తెచ్చుకోవాల‌ని భావించిన చంద్ర‌బాబు.. విప్ జారీ చేయించి మ‌రీ .. వారిని రాజ్య స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ఓటు వేయించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే, వారు ఎన్నిక‌ల్లో ఓటైతే వేశారు కానీ.. అది చెల్ల‌కుండా పోయేలా వ్యూహం ర‌చించుకున్నారు. అయితే, ఇది కూడా త‌మ విజ‌యం గానే టీడీపీ నేత‌లు చెబుతున్నారు.వారిని భయపెట్టగలిగామని వారి ఆటలు సాగనివ్వబోమని టిడిపి నేతలు జబ్బులు చరుస్తున్నారు.ఈ తరహా ప్రకటనలు చూసి విని ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు.చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని తనదైన శైలిలో రాజకీయ నడిపితేనే మంచిదని,
పగటి కలలు కనడం మానేయడం ,ప్రజలు వెర్రివాళ్ళు అనుకునే విధానాన్ని విడనాడడం టిడిపి నాయకత్వానికి ఎంతైనా అవసరం అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు 


Share

Related posts

Marriage: పెళ్ళికి ముందు ఊహించుకున్న జీవితం పెళ్ళి తర్వాత ఉండక పోవడానికి కారణం ఇదే!!(పార్ట్-1)

Kumar

పూజా హెగ్డే కి టాలీవుడ్, బాలీవుడ్ కంటే కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ ..?

GRK

వరద నష్టం అంచనాకు హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర బృందం

somaraju sharma