Check : చెక్ ..టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా. గత ఏడాది భీష్మ సినిమాతో భారీ హిట్ అందుకున్న నితిన్ నుంచి మళ్ళీ సినిమాలు రాలేదు. దాదాపు సంవత్సరం అయిపోయింది. అందుకే త్వరలో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో రాబోతున్నాడు. ఆ రెండు సినిమాలు చెక్, రంగ్ దే. రెండింటికి రెండు డిఫ్రెంట్ జోనర్స్ లో తెరకెక్కిన సినిమాలు. ఇక చెక్ సినిమా గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ యేలేటి – నితిన్ కాంబినేషన్ లో వస్తున్న థ్రిల్లర్ సినిమా కావడం తో సినిమా ఎలా ఉండబోతుందా అని ఆసక్తి పెరుగుతోంది.
టాలీవుడ్ లో దర్శకుడిగా చంద్ర శేఖర్ యేలేటి సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంటాయి. ఈ క్రమంలో నితిన్ నటించిన చెక్ మీద చాలా నమ్మకంగా ఉన్నారు చిత్ర యూనిట్. వీరిలో ముఖ్యంగా సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ చెక్ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఎప్పుడో ఒక చిన్న వీడియో తో సంచలనం అయింది ప్రియా ప్రకాష్. ఒరు అదార్ లవ్ అన్న సినిమాలో ఉన్న చిన్న సీన్ లోని బిట్ దేశ వ్యాప్తంగా ప్రియా ప్రకాష్ వారియర్ కి లక్షల్లో ఫ్యాన్స్ ఉండేలా చేసింది. ఆ క్రేజ్ తో వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి.
Check : చెక్ సినిమా మీదే ప్రియా ప్రకాష్ వారియర్ అన్నీ హోప్స్ ..!
కాని అమ్మడు చేసిన డిమాండ్ కి నిర్మాతల కళ్ళు బైర్లు కమ్మాయి. దాంతో కొంతమంది నిర్మాతలు డ్రాపయ్యారు. కొంతమంది ఫస్ట్ సినిమా రిలీజయ్యే వరకు వేయిట్ చేశారు. ఎట్టకేలకి ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది. కాని ప్రియా ప్రకాష్ కి షాకిచ్చింది. అట్టర్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. దాంతో ఈ బ్యూటి అనుకున్న ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి. అయితే ప్రస్తుతం నితిన్ తో చేస్తున్న చెక్ సినిమా మీదే ప్రియా ప్రకాష్ వారియర్ అన్నీ హోప్స్ పెట్టుకుందని అంటున్నారు. చుడాలి మరి ఈ సినిమా హిట్ అయితే ఈ బ్యూటికి టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయా లేదా ..! కాగా చెక్ ఈ నెల 19 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!