Troubles: మనం ఇళ్లు నిర్మించుకునే సమయంలో కచ్చితం గా వాస్తుని అనుసరిస్తాం. ఇక మనకు ఏ దిక్కు ఎక్కువగా మంచి అనేది చూసుకుని తూర్పు ,పడమర ,ఉత్తరం దక్షిణం అనేది చూసుకుంటా. మనం ఏ పని చేసినా ఆ వైపు ఉండేలా జాగ్రత్త పడతాము. దిశను బట్టే దశ ఉంటుందని భావిస్తుంటారు. ఇంట్లో ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి అనేదానిపై కూడా వాస్తుని అనుసరించే వారు ఉంటారు.వీటిని నమ్మేవారు, పాజిటీవ్ ఎనర్జీ, నెగిటీవ్ ఎనర్జీ అనేది కొన్ని వస్తువులు ఒకచోట నుంచి మరోచోటికి పెడితే వస్తుంది అని నమ్ముతారు (చాలా కొద్దీ మంది మాత్రమే). వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల ప్రతికూల పరిస్థితులు ఉంటాయి అని అంటున్నారు. ఆ వస్తువులు ఏమిటి అనేది తెలుసుకుందాం.
Troubles: గుమ్మం నుంచి లోపలి వచ్చేవారికి
ఇంట్లో ఎట్టి పరిస్దితుల్లోకూడా ఈశాన్యం మూలన చెత్త కాని చీపుర్లు కానీ అస్సలు ఉండకూడదు.
ఇంట్లో ఊడ్చుకునే చీపురు గుమ్మం నుంచి లోపలి వచ్చేవారికి కనబడకుండా ఉండేవిధంగా పెట్టుకోవాలి.
దేవుడి గూటికి ఆనించి చీపురు అసలు ఎప్పుడు పెట్టకూడదు.
నరికివేయబడిన పచ్చని చెట్లు ఇంటి సరిహద్దుల్లో వేయకూడదు.
విరిగిపోయిన ఫర్నిచర్, చెదపట్టిన చెక్కలు
తుప్పు పట్టిన ఇనుము ,పనికి రాణి వస్తువులు ఇంట్లో ఉంచకపోవడమే మంచిది.
పగిలిన విరిగిన వస్తువులు
పావురం మన ఇంటి హద్దుల దగ్గర గూడు పెట్టుకుంటే దానిని ఉదయం చూడకుండా ఉండడం మంచిది.
ఆగిపోయిన గడియారం,పగిలిన అద్దాలు అసలు ఏ దిక్కులో కూడా ఉంచకూడదు.
తూర్పు దక్షిణం దిక్కున పగిలిన విరిగిన వస్తువులు పెట్టడం వంటివి అసలు చేయకుండా ఉండడం మంచిది.