మాల్దీవుల్లో అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌: హిందూ మహా సముద్రం, బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. మరోవైపు మాల్దీవుల ప్రాంతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. తెలంగాణలో మంగళ, బుధవారాల్లో పొడి వాతావరణం ఉంటుందని రాజారావు తెలిపారు. ఉత్తర తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదై చలి పెరిగే సూచనలున్నాయి. గాలిలో తేమ శాతం అధికంగా ఉంటోంది.

SHARE