Omrican effect: కరోనా సెకండ్ వేవ్ తరువాత అంతా సద్దుమణిగింది అని ఆనందపడేలోపే కరోనా మరో రూపం అయినటువంటి ఒమిక్రాన్ మానవుడి నడ్డి విరిచింది. అవును.. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ 19, ఒమిక్రాన్ కేసులు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే దేశ ఆర్ధిక వ్యవస్థ బాగా దెబ్బతింది. చిన్న, పెద్ద పరిశ్రమలు కుదేలు అయ్యాయి. ఇటు సామాన్యుడినుండి అటు సంపన్నుడి వరకు కూడా ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యారు. అది చాలదన్నట్టు ఇపుడు ఒమిక్రాన్ భూతం భయపెడుతోంది.
Omrican effect: ఒమిక్రాన్ భూతం వలన తాజాగా జరిగిన, జరుగుతున్న మార్పులు ఇవే..
ఒమిక్రాన్ ప్రబలడంతో ప్రస్తుతం రాష్ట్రాల వారీగా అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికి చాలా రాష్ట్రాల్లో థియేటర్స్ 50 శాతం అక్యుపెన్సీని అమలు చేసాయి. త్వరలో మన రాష్ట్రంలో కూడా మొదలయ్యే అవకాశం లేకపోలేదు. అందుకే తాజాగా విడుదలకు రెడీగా వున్న సినిమాలు కూడా వెనక్కి తగ్గాయి. ఇందులో భాగమే RRR, మరియు రాధే శ్యామ్. అలాగే వివిధ పరిశ్రమల్లో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కోవలోనే తాజాగా బ్యాంక్ యూనియన్లు బ్యాంకింగ్ పని వేళలను మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇపుడు బ్యాంకుల సంగతి ఏంటి?
ఈ సందర్భంగా వారు వారానికి 5 రోజుల పని దినాలు కుదించాలని అడుగుతున్నారు. పరిస్థితులు చక్కబడేంత వరకు ఉద్యోగ వేళల్లో మార్పులు కావాలని సూచిస్తున్నారు. ఈ మేరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (మహరాష్ట్ర) ఈమేరకు స్టేట్ లెవెల్ బ్యాంక్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ)కి ఒక లేఖ రాసింది.
బ్యాంకింగ్ పనివేళలను మధ్యాహ్నం 2 గంటల వరకే పరిమితం చేయాలని కోరింది. దీని వల్ల బ్యాంక్ బ్రాంచుల్లో కస్టమర్ల తాకిడి తగ్గుతుందని తెలిపింది. ఇలా చేయడం వల్ల బ్యాంక్ ఉద్యోగులు, కస్టమర్లలో కోవిడ్ వ్యాప్తి తగ్గొచ్చని తెలిపింది.