Gents: మన భారతీయు లలో ఎక్కువ మంది పురుషులు నడుముకి తప్పని సరిగా నల్లని లేదా ఎర్రని రంగులో ఉన్న తాడును కట్టుకుంటున్నారు. నిజానికి అలా ఎందుకు కట్టుకోవాలి?దీనివల్ల ప్రయోజనం ఏమిటి అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇంకా చెప్పాలంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఆడపిల్లలకు కూడా మొలతాడు కడుతుంటారు. పెరిగే కొద్దీ ఆడపిల్లలు తీసేస్తారు.. మగ వారు మాత్రం జీవితాంతం చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం. ఇది చాలా పురాతనమైన ఆచారం కావడం తో దీన్నొక మూఢ నమ్మకం గా కొట్టి పారేస్తున్నారు. ఈ ఆచారం వెనుక ఉన్న అసలు కారణం తెలిసిన తరువాత మన ప్రాచీ నులకు ఉన్న గొప్ప శాస్త్రీయ పరిజ్ఞానానికి విదేశీయులు సైతం ఆశ్చర్య పోయారు.
మొలతాడు ధరించడం ఎందుకో చూద్దాం. చిన్నపిల్లలు త్వరగా ఎదుగుతుంటారు. వారు ఎదిగే క్రమం లో ఎముకలు, కండరాల పెరుగుదల సక్రమమైన పద్ధతిలో.. ఉండడానికి నడుముకు కట్టే మొలతాడు ముఖ్య పాత్ర పోషిస్తుంది. మగ పిల్లలు ఎదిగే క్రమం లో పురుషాంగం పెరుగుదల జరిగేటప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా మొలతాడు రక్షణ కల్పిస్తుంది.రక్త ప్రసరణ పెంచుతుంది. మగ పిల్లలకు, పురుషులకు హెర్నియా రాకుండా మొలతాడు కాపాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. ఎందుకంటే ఇది విదేశీ పరిశోధనలో కూడా తేలిన విషయం.
ఎరుపు , నలుపు రంగులో దొరికే మొలతాడును కట్టుకోవచ్చు. చిన్నపిల్లల కి బంగారం లేదా వెండి తో చేసింది కట్టవచ్చు . అలా కుదరని వారు బయట దొరికే మామూలు మొలతాడు ని కట్టవచ్చు. మొలతాడు కు ఎటువంటి పిన్నీసు,తాళం చెవులు తగిలించడం వంటివి చేయకూడదు.కాబట్టి మొలతాడు లేకుండా ఉండకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్పేవారు.. అసలు పాత మొలతాడు తీసివేయాలి అంటే.. ముందు కొత్తది కట్టుకుని ఆ తర్వాత పాతది తీసేస్తారు. దీనికి అంత ప్రాధాన్యత ఉంది మరి.